Kitchen Hacks: వంటగదిలో ఉండే ముఖ్యమైన ఎలక్ట్రానిక్ పరికరాలలో ఫ్రిజ్ ఒకటి. నేటి కాలంలో అది లేకుండా నడపడం చాలా కష్టం. ముఖ్యంగా సమ్మర్ సీజన్ లో ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఫుడ్ ఐటమ్స్ అన్నీ తాజాగా ఉంటాయి. అనేక పండ్లు, కూరగాయలు లేదా ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం ద్వారా అవి చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. అయితే ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా హాని కలిగించే కొన్ని విషయాలు ఉన్నాయని మీకు తెలుసా. ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడని ఆహారాలు ఏవో తెలుసుకుందాం.
టొమాటో , నిమ్మకాయ యూరిక్ యాసిడ్ ప్రభావాన్ని తగ్గిస్తుంది, ఈ ఇంటి నివారణలు కూడా ప్రభావవంతంగా ఉంటాయి
టొమాటో:
దాదాపు అన్ని ఇళ్లలో కూరలను చేసేందుకు టొమాటోలను అధికంగా ఉపయోగిస్తారు. దీంతో ఒక్కసారిగా టమాటా ఎక్కువగా కొని ఫ్రిజ్‌లో భద్రపరుస్తున్నారు. ఫ్రిజ్‌లోని చల్లని గాలి టమోటాలు లోపల కుళ్ళిపోయేలా చేస్తుంది. బయటకు మాత్రం ఎరుపు రంగులో మెరుస్తున్నట్లుగా కనిపిస్తాయి. కాబట్టి, తాజా టమోటాలు తినడానికి ప్రయత్నించండి. అటువంటి పరిస్థితిలో ఏ టమోటాలు తాజావి.. చెడ్డవి అని తెలియదు. మీరు అనుకోకుండా చెడిపోయిన టమోటాలు తింటే అది మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.
తేనె:
ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న తేనెను అనేక ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు. అయితే, చాలా తక్కువ మంది మాత్రమే ప్రతి రోజు తేనెను ఉపయోగిస్తారు. కొంతమంది తేనె చెడిపోతుందనే భయంతో రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం అవసరమని భావిస్తారు. కానీ ఇలా చేయకూడదు ఎందుకంటే తేనెను ఫ్రిజ్‌లో ఉంచడం ద్వారా స్ఫటికాలుగా మారుతుంది. ఈ సందర్భంలో దాని రుచి మారుతుంది. అలాగే ఈ తేనె తింటే అనారోగ్యానికి గురవుతారు.
అరటిపండ్లు:
అరటిపండ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. ఇలా చేయడం వల్ల త్వరగా కరిగి నల్లగా మారుతాయి. అలాగే ఫ్రిజ్ లో ఉంచిన అరటిపండ్లు తింటే ఆరోగ్యం పాడవుతుంది. అరటితోపాటు ఫ్రిజ్ లో నిల్వ చేసిన ఇతర పండ్లు, కూరగాయలు కూడా పాడైపోతాయి.
బంగాళదుంపలు.. ఉల్లిపాయలు :
కొందరైతే ఇతర కూరగాయలతోపాటు బంగాళదుంపలను ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఫ్రిజ్‌లో ఉంచిన బంగాళదుంపలు తింటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రాణాంతకం. బంగాళాదుంప పిండి గడ్డకట్టడం ద్వారా చక్కెరగా మారుతుంది. బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో ఉంచకుండా వాటిని పేపర్ బ్యాగ్‌లో ఉంచి బహిరంగ ప్రదేశంలో ఉంచండి. ఇది కాకుండా, ఉల్లిపాయలను ఎప్పుడూ ఫ్రిజ్‌లో ఉంచకూడదు. దీంతో ఫ్రిజ్‌లో ఉంచిన ఇతర వస్తువులకు వాసన వ్యాపిస్తుంది.
ఇవి కూడా చదవండి: Amazing Video: ఇంతకాలం చిరుత వేటాడం మాత్రమే చూశాం.. అక్కడ లెక్క తప్పింది..
Health Tips: డయాబెటీస్ బాధితులు రోజు వీటిని తినడం మరిచిపోవద్దు.. అవేంటో తెలుసా..