
మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే కాసేపు కునుకు తీయాలనిపించడం సర్వసాధారణమైన విషయం. అది ఆఫీసు అయినా, ఇంట్లో అయినా, ప్రయాణంలో ఉన్నా.. తినగానే మత్తుగా అనిపిస్తుంది. అబ్బా కాసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఇంతకీ తి్న వెంటనే నిద్ర రావడానికి కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? మధ్యాహ్నం భోజనం చేయగానే నిద్ర వచ్చినట్లు అనిపించడానికి గల కొన్ని ప్రధాన కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం…
* భోజనం చేసిన వెంటనే బద్దకంగా, మత్తుగా అనిపిండచానికి ప్రధాన కారణం మన శరీరం జీర్ణక్రియపై ఎక్కువగా దృష్టిసారించడమే. భోజనం చేసిన వెంటనే ఆహారం విచ్ఛిన్న చేయడానికి, పోషకాలను గ్రహించడానికి రక్తం జీర్ణ వ్యవస్థవైపు మళ్లించబడుతుంది. శరీరంలో రక్త ప్రసరణలో వచ్చిన ఈ మార్పు కారణంగా మనకు తిన్న వెంటనే నిద్ర వచ్చిన భావన కలుగుతుంది.
* మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే కార్బోహైడ్రేట్‌లు లెవల్స్ ఒక్కసారిగా భారీగా పెరుగుతాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ కారణంగా మత్తుగా ఉన్న భావన కలుగుతుంది.
* ఇక కొవ్వుతో కూడుకున్న భోజనం చేసినా నిద్ర వస్తుంది. శరీరం కొవ్వులను జీర్ణం చేయడానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో మెదడుకు రక్త ప్రసరణ తగ్గుతుంది. దీంతో మెదడు చురుకుతనం తగ్గుతుంది. వెరసి మత్తు కలిగిన భావన ఉంటుంది.
* మధ్యాహ్నం భోజన సమయంలో సరిపడ నీరు తీసుకోకపోయినా బద్ధకంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. డీహైడ్రేషన్ కూడా దీనికి ఒక కారణంగా చెబుతున్నారు. కాబట్టి భోజనం చేసిన తర్వాత బాగా నీరు తాగితే నిద్ర రాదని చెబుతున్నారు.
* ఇక భోజనంలో సరిపడ ప్రోటీన్స్ లేకపోయినా నిద్ర వస్తుందని నిపుణుల అభిప్రాయం. మనం నిత్యం యాక్టివ్‌గా ఉండడంలో ప్రోటీన్ కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే.. మధ్యాహ్న భోజనంలో బీన్స్, వెజిటెబుల్స్ ఉండేలా చూసుకోవాలి.
* ఒత్తిడి, మానసికంగా అలసిపోవడం కూడా మధ్యాహ్నం నిద్రకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు లాంగ్ బ్రీత్ లేదా ధ్యానం వంటివి చేస్తే ఒత్తిడి దూరమవుతుంది.
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిద్రరాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్న భోజనంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇక శరీరం డీహైడ్రేషన్ కాకుండా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి తగినంత నీటిని తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే పనికి ఉపక్రమించవద్దు. కాసేపు వాకింగ్, బ్రీతింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. ఇలా చేయడం వల్ల తిన్న తర్వాత వచ్చే నిద్రకు చెక్ పెట్టొచ్చు.
మరిన్ని ఆసక్తికర కథనాల కోసం క్లిక్ చేయండి..