Telangana: ఇదో వింత వర్షం..! నోర్లూ వెళ్ళబెట్టి చూసిన హైదరాబాద్ వాసులు..!

| Edited By: Balaraju Goud

Aug 23, 2024 | 12:04 PM

వాన రాకడ.. ప్రాణం పోకడ గురించి ఖచ్చితంగా ఎవరం ఏమీ చెప్పలేం..! అలా ఎందుకు అంటారో తెలుసా? అర చేతిని అడ్డుపెట్టి వర్షాన్ని ఎవరూ ఆపలేరు. అలాగే పోతున్న ప్రాణాన్ని కూడా ఎవరూ ఆపలేరు. అందుకే ఈ సామెత పుట్టుకొచ్చింది

Telangana: ఇదో వింత వర్షం..! నోర్లూ వెళ్ళబెట్టి చూసిన హైదరాబాద్ వాసులు..!
Strange Rain
Follow us on

వాన రాకడ.. ప్రాణం పోకడ గురించి ఖచ్చితంగా ఎవరం ఏమీ చెప్పలేం..! అలా ఎందుకు అంటారో తెలుసా? అర చేతిని అడ్డుపెట్టి వర్షాన్ని ఎవరూ ఆపలేరు. అలాగే పోతున్న ప్రాణాన్ని కూడా ఎవరూ ఆపలేరు. అందుకే ఈ సామెత పుట్టుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఇది వర్షాలు విపరీతంగా కురుస్తున్న సమయం. హైదరాబాద్ నగరమైతే చిన్నపాటి వర్షానికే తడిసి ముద్దవుతోంది. అలాంటి తరుణంలో గురువారం(ఆగస్ట్ 22) రాత్రి హైదరాబాద్ మహానగరంలో కురిసిన వింత వర్షంపై జనాలు ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు. మరి ఆ వింత వర్షం సంగతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!

హైదరాబాద్ పాతబస్తీలోని మురాద్ నగర్ పోస్ట్ ఆఫీస్ లైన్ ఏరియాలో వింత వర్షం కురిసింది. స్థానిక కాలనీలోని ఒక చిన్న గల్లీలో ఒకే దగ్గర వర్షం పడింది. మళ్లీ ఆ వర్షం ఇటు పక్క, అటు పక్క గానీ పడలేదు. జనాలు ఈ వింత వానని చూస్తూ అలాగే రోడ్డుపై నిలబడిపోయారు. ఒక ఇంటి ముందు కురుస్తున్న వర్షం మళ్లీ ఆ చుట్టుపక్కల ఎక్కడా లేదు. ఒక్కోసారి వాతావరణంలో జరిగే మార్పుల వల్లే ఇలా అవుతుందని నిపుణులు అంటుంటే.. మరికొందరు బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు, అందుకే ఇలా అవుతుందని అంటున్నారు. ఏది ఏమైనా ఆ కాలనీ ప్రజలకు ఇది చాలా వింతగా తోచింది. దీనిపై అక్కడివారికి అనేక అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

వాతావరణం కొన్నిసార్లు పొడిగా ఉన్నప్పుడే వర్షం మొదలవుతుంది. లేదంటే బాగా మబ్బులు పట్టినా వర్షం విపరీతంగా కురుస్తుంది. మరి కొన్నిసార్లయితే ఒక వైపు ఎండ కొడుతున్నా వర్షం పడుతుంది. ఇలాంటి ఘటనలు మనం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. కారణాలు ఏవైనా ఇలా జరిగినప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తున్న మాట నిజమే..! అలాంటిదే ఇప్పుడు జరిగిన ఘటన కూడా. ఒకే కాలనీలో ఒక చోట వర్షం కురుస్తుంటే.. మరోచోట కురవట్లేదు. అలా ఎందుకు ఏంటి అంటే మనం ఏం చెప్పలేం. అది చూసిన వాళ్లంతా షాక్ అయ్యారు. ఎందుకు అలా జరుగుతుందో తెలియక తికమకపడ్డారు. వింతగా చూస్తూ ఆ వర్షాన్ని ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూడండి..

మరి ఒకే ప్రదేశంలో ఒక చోట కురిసి మరోచోట కురవకపోడం ఏంటి.. బ్రహ్మంగారు చెప్పినట్టుగా నిజంగానే ఇలాంటి విచిత్రాలు జరుగుతున్నాయి అంటారా? ఇది దేవుడిచ్చిన వరమా..? లేకపోతే ప్రజలు చేసిన తప్పుల వల్లే దేవుడి ఆగ్రహం వల్ల ఇలాంటి వింతలు చోటు చేసుకున్నాయా అని చర్చించుకుంటున్న వాళ్లూ లేకపోలేదు. ఇలాంటి వింత వర్షాలపై వాతావరణ అధికారులు మాత్రం భయపడాల్సింది ఏమీ లేదని కొట్టిపారేస్తున్నారు. చిన్నపాటి మబ్బు పేరుకున్నప్పుడు ఆ కొంచెం ప్రాంతంలోనే వాన కురిసే అవకాశం ఉంటుందని, అందులో వింత ఏముందని గట్టిగానే వాదిస్తున్నారు. అలాంటి వర్షం ఎక్కువ సేపు ఉండదని, కానీ ఇలాంటివి ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతాయని కూడా చెబుతున్నారు.

అదంతా కాదు.. ప్రపంచంలో చోటు చేసుకుంటున్న విపరీత పరిణామాల కారణంగానే ఇలాంటి వింతలు జరుగుతాయని మరికొందరి వాదన. ఈ ప్రపంచం త్వరలోనే అంతం అవుతుందని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారని.. దాన్ని సమర్థించే విధంగానే ఇలాంటి విపరీతాలు జరుగుతాయని అంటున్నారు. ఏది ఏమైనా ప్రజలు గుడ్డిగా ఏది నమ్ముతున్నా వాతావరణంలో అప్పుడప్పుడు జరిగే ఇలాంటి వింతలు చూడడానికి చాలా అద్భుతం అనిపిస్తాయి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..