King Kobra: క్రూర మృగాలకు హడల్.. నాగుపామైనా తోక ముడవాల్సిందే.. కింగ్ కోబ్రాలు ఎందుకంత డేంజర్?
పాముల ప్రస్తావన వస్తే ముందుగా మనకు గుర్తొచ్చేది నాగుపామే. దాని విషానికున్న పవర్ అలాంటిది. ఇవి కాకుండా పాముల్లోనే డేంజరస్ పాములు ఉ్నాయి. వీటి కాటుకు గురైతే బతికి బట్టగట్టడం అంత సులభం కాదు. కానీ ఒక్క పాము పేరు వింటే మిగిలిన ఏ పామైనా తోకముడవాల్సిందే.. ఆగ్నేయాసియాలోనే వీటికి డేంజర్ స్నేక్స్ గా వీటికి పేరుంది. వీటి భయంకర రూపం, బుసలు కొట్టే స్వరం వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. శత్రువు ఎంత బలవంతంగా ఉన్నా అది కొండచిలువే అయినా సరే ఒక్క ఉదుటున మింగేయగలవు..

శత్రువును ఎంత దూరం నుంచైనా ఇట్టే పసిగట్టగలవు. దీని మెదడు పాదరసం. జ్ఞాపకశక్తి మనం ఊహించలేనంత. ఒక్క సారి టార్గెట్ ఫిక్స్ చేసింది అంటే ఇక ఎంతటి జంతువైనా, మనిషైనా దాని కోరలకు బలి కావాల్సిందే.. దీన్ని కదిపితే ఇక బతుకు మీద ఆశలు చాలించుకోవాల్సిందే. పాముల్లోనే అత్యంత డేంజరస్ పాము ఇది. దీని పేరే కింగ్ కోబ్రా. శత్రువులనే కాదు.. సాటి పాములను కూడా వేటాడగల ప్రత్యేక లక్షణం దీని సొంతం. ప్రపంచంలోనే అత్యంత తెలివైన పాముగా దీనికి పేరుంది. దీని గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
గురి తప్పదు…
కింగ్ కోబ్రాలకు సాధారణంగానే ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయని జంతు శాస్త్రం చెప్తుంది. వేట కోసం ఇది ఉపయోగించే అస్త్రాలు మనల్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి. ఇది అన్ని పాముల్లా వేటాడదు. దీనికి ముందు ఓ ప్లానింగ్ ఉంటుంది. ఒక్కసారి దీని ఫోకస్ పెడితే ఇక అది గురితప్పదు. ఇతర పాములను సైతం వేటాడగల కెపాసిటీ దీనికుంది. శత్రువలను మట్టుబెట్టడంలో కోబ్రాకు సాటి లేదంటారు.
ఎక్కడ నెగ్గాలో కాదు..
కోబ్రాలు అడవులకు బాస్ లాగా వ్యవహరిస్తుంటాయి. అయితే, అన్ని చోట్లా అధికులమనరాదన్నట్టుగా అవసరమైన చోట ఇవి తగ్గి ఉంటాయి. ప్రమాదాన్ని ముందే ఊహించి ఏ విధంగా స్పందించాలో వీటికి బాగా తెలుసు.
18 అడుగుల భయంకర రూపం..
చూస్తేనే ఒళ్లు గొగుర్పొడిచే రూపం వీటిది. ఇవి పసుపు, ఆకుపచ్చ, గోధుమ లేదా నలుపు రంగుల్లో కనపడుతుంటాయి. వీటి సగటు పరిమాణం 10 నుంచి 18 అడుగుల వరకు పొడవు పెరగగలవు. ఉత్తర భారతదేశం, దక్షిణ చైనా, మలయ్ ద్వీపకల్పం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్. వాగులు, అడవులు, వెదురు పొదలు, వ్యవసాయ ప్రాంతాలు వీటికి ఇష్టమైన ఆవాసాలు. మడ అడవుల చిత్తడి నేలలను కూడా ఇవి ఇష్టపడుతుంటాయి.
పాములనూ మింగేయగలదు..
ఇతర పాములను కోల్డ్-బ్లడెడ్ జంతువులను కోబ్రాలు ఇష్టపడతాయి. ఆసియా ఎలుక పాములు, ధమాన్లు, కొండచిలువలు, భారతీయ కోబ్రాస్, క్రైట్స్, నాగుపాములు, చిన్న కింగ్ కోబ్రాలను కూడా నమిలి మింగేయగలదు.
దీని కంటి నుంచి తప్పించుకోలేం..
కోబ్రాల కంటి చూపు చాలా చురుకుగా స్పష్టంగా ఉంటుంది. 330 అడుగుల (100 మీటర్లు) ఎత్తు నుండి కదులుతున్న వ్యక్తిని కూడా చూడగలదు. కుక్క అరుపులాగా లాగా బుసలు కొడుతుంది.దాదాపు 20 సంవత్సరాలు అడవిలో జీవించగలదు.
పిల్లల జోలికొస్తే అంతే..
వీటి గూళ్లను తయారు చేసుకోవడంలోనే కాదు వాటిని సంరక్షించడాన్ని కూడా అవి సీరియస్ గానే తీసుకుంటాయి. వాటి జోలికి వెళ్తే ఇక ఆ జంతువుల పని అంతే. జనవరి నుండి ఏప్రిల్ వరకు. 21 నుండి 40 గుడ్లు పెడుతుంది. ఆడది గూడు కట్టుకుని గుడ్లను కాపాడుతుంది. గుడ్లు కుళ్ళిపోవడం నుండి వేడి ద్వారా పొదిగేవి. శరదృతువులో పొదుగుతాయి.
దీని విషం డేంజర్..
కింగ్ కోబ్రా విషం శరీరం లోని నాడీ వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ విష ప్రభావం వలన దేహమంతా తీవ్రమైన నొప్పి, మసక బారిన దృష్టి, తల తిరగడం, మగత, పక్షవాతం కలుగుతాయి. తరువాత కొన్ని నిముషాలలోనే గుండెకు రక్త సరఫరా మందగిస్తుంది. దీనివలన కాటు తగిలిన జీవి కొద్ది సేపటికే స్పృహ కోల్పోతుంది.
