Liquor Free Village in Medak: మార్పు రావాలి, మార్పు రావాలి అంటారందరు. ఎవరూ మారరు. కానీ, ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలోని చాలా గ్రామాల ప్రజలు మార్పు తీసుకొచ్చి చూపారు. అక్కడి ప్రజలు చేస్తున్న పనిని కొనియాడుతున్నారు ప్రముఖులు. ముఖ్యంగా ఆ ఊరి మహిళలు, యువకులు చేసిన పనితో గొడవలు లేని గ్రామంగా నిలిచింది. ఎలాంటి సమస్యలు లేకుండా ఊరి బాగోగుల కోసం అందరూ కలిసి పనిచేస్తున్నారు.
ఇతర గ్రామాల ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని చాలా గ్రామాల్లో మద్యపాన నిషేధం కొనసాగుతుంది. దీని కోసం కష్టపడ్డ వారిలో మహిళలు, యువతే కీలకం అని చెప్పాలి. గ్రామాల్లో మద్యం ఏరులై పారినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నామని, ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. బోడ్మాట్ పల్లి, ముప్పారం, తంఫ్లూర్, మారేపల్లి ప్రగతిధర్మారం, సీఎం దత్తత గ్రామం ఎర్రవల్లి ఇలా చాలా గ్రామాల్లో మద్యపాన నిషేధం కొనసాగుతోంది. ఈ గ్రామాల్లో మద్యం అమ్మరు, తాగరు. దీని కోసం గ్రామ పంచాయితీల్లో ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు ప్రజలు. ఎవరైనా మద్యం అమ్మినా, తాగిన 50 వేల జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ మద్యపాన నిషేధాన్ని అమలు చేయడానికి చాలానే కష్టపడ్డారు ప్రజలు. వీరుచేసే ఈ ప్రయత్నానికి ఎంతో మంది అడ్డువచ్చారు. అయినా ముందుకెళ్లి అనుకున్నంది సాధించారు ప్రజలు. ఆందోల్ నియోజకవర్గంలోని బోడ్మాట్ పల్లి గ్రామంలో ఎనిమిదేళ్లుగా మద్యపాన నిషేధం అమలవుతుంది. ముప్పారంలో నాలుగు, తంఫ్లూర్ గ్రామంలో మూడేళ్లుగా అమలవుతుంది. ఈ గ్రామాలన్నీ జాతీయ రహదారి 161 సమీపంలో ఉన్నవే. గతంలో మద్యం తాగి ఎంతోమంది ఈ రహదారిపై ప్రమాదాలకు గురై మృతిచెందారు. ప్రస్తుతం బెల్ట్ షాప్‌లు బంద్ అవడంతో ప్రమాదాల సంఖ్య తగ్గింది.
Read Also… GHMC: ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి జీహెచ్‌ఎంసీ షాక్.. ఫ్లెక్సీలను తొలగించనందుకు భారీగా జరిమానా..