Alcohol: రోజూ ఒక పెగ్‌ వేస్తే ఏం కాదా.? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోందంటే..

ప్రపంచ వ్యాప్తంగా మారుతోన్న వర్క్‌ కల్చర్‌, ఇతర దేశాల ప్రభావంతో భారత్‌లోనూ మద్యపాన వినయోగం పెరుగుతోంది. ఇక సోషల్‌ డ్రింక్‌ పేరుతో కొందరు ఆల్కహాల్‌ను ఒక స్టేట్‌ ఆఫ్‌ సింబల్‌గా భావిస్తున్నారు. ఇక మరికొందరైతే రోజుకు ఒక పెగ్‌ మందు తాగితే ఆరోగ్యానికి ఏం కాదని అంటుంటారు. ఆ మాటకొస్తే ఆరోగ్యానికి మంచిదని కూడా వాదిస్తుంటారు. అయితే నిజంగానే రోజుకో పెగ్ తీసుకుంటే ఆరోగ్యానికి ఏం కాదా.?

Alcohol: రోజూ ఒక పెగ్‌ వేస్తే ఏం కాదా.? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోందంటే..
Alcohol

Edited By: Ram Naramaneni

Updated on: Dec 18, 2023 | 12:35 PM

మద్యపానం ఆరోగ్యానికి హానికరమనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆల్కహాల్‌ మనిషి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని తెలిసినా మందు బాబులు మాత్రం. పెగ్గు మీద పెగ్గు వేస్తుంటారు. అయితే ప్రస్తుత కాలంలో ఆల్కహాల్‌ అనేది కూడా ఒక కామన్‌ డ్రింక్‌లా మారిపోయే పరిస్థితులు వచ్చేశాయి. ఆఫీసు పార్టీల్లో కూడా మందు సర్వ్‌ చేయడం అలవాటుగా మారుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా మారుతోన్న వర్క్‌ కల్చర్‌, ఇతర దేశాల ప్రభావంతో భారత్‌లోనూ మద్యపాన వినయోగం పెరుగుతోంది. ఇక సోషల్‌ డ్రింక్‌ పేరుతో కొందరు ఆల్కహాల్‌ను ఒక స్టేట్‌ ఆఫ్‌ సింబల్‌గా భావిస్తున్నారు. ఇక మరికొందరైతే రోజుకు ఒక పెగ్‌ మందు తాగితే ఆరోగ్యానికి ఏం కాదని అంటుంటారు. ఆ మాటకొస్తే ఆరోగ్యానికి మంచిదని కూడా వాదిస్తుంటారు. అయితే నిజంగానే రోజుకో పెగ్ తీసుకుంటే ఆరోగ్యానికి ఏం కాదా.? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది.? తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ఒక వ్యక్తి రోజుకు ఎంత ఆల్కహాల్‌ తీసుకోవచ్చన్న దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఓ నివేదికను విడుదల చేసింది. ఈ సంస్థ ప్రకారం రోజుకు ఒక పెగ్‌ కూడా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని తేల్చి చెప్పింది. అసలు మద్యం సేవించడం ఆరోగ్యానికి ఏ విధంగానూ మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఒక పెగ్ ఏం కాదన్న దాంట్లో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని నివేదికలో పరిశోధకులు తెలిపారు.

ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల క్యాన్సర్‌, లివర్‌ ఫెయిల్యూర్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశం భారీగా పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. గుండె సంబంధిత వ్యాధులకు కూడా ఆల్కహాల్‌ కారణమని హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్‌ ముమ్మాటికీ ఒక రకమైన విష పదార్థమని, ఇది శరీరానికి తీవ్రమైన హాని కలిగిస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ కొన్నేళ్ల క్రితం.. గ్రూప్ 1 కార్సినోజెన్‌లో ఆల్కహాల్‌ను చేర్చింది. ఆస్బెస్టాస్, రేడియేషన్, పొగాకును కూడా ఈ ప్రమాదకరమైన సమూహంలో చేర్చారు. ఈ నివేదిక ప్రకారం, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్‌కు ఆల్కహాల్ మంచిదని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..