Beggar to Doctor: బిక్షాటన నుంచి డాక్టర్ గా మారిన యువతి .. సక్సెస్ స్టోరీ

|

Oct 04, 2024 | 4:51 PM

పింకీ హర్యాన్ చిన్నతనంలో తన తల్లిదండ్రులతో కలిసి వీధుల్లో భిక్షాటన చేసింది. మెక్లీడ్‌గంజ్‌లోని చెత్త కుప్పల్లో ఆహారం కోసం వెదికేది. ఆ చిన్నారి బాలిక ఇరవై సంవత్సరాల తర్వాత డాక్టర్ గా మారింది. చైనీస్ డాక్టర్ డిగ్రీ పొందిన పింకీ ఇప్పుడు భారతదేశంలో మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి అర్హత సాధించే పరీక్షలో క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది. బిక్షాటన నుంచి డాక్టర్ చదువు వరకూ పింకీ ప్రయాణానికి సంబందించిన స్టోరీలోకి వెళ్తే..

Beggar to Doctor: బిక్షాటన నుంచి డాక్టర్ గా మారిన యువతి .. సక్సెస్ స్టోరీ
Dr. Pinki Haryan With Therchin Gyaltsen
Follow us on

కృషి, పట్టుదల ఉన్న వ్యక్తులకు అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తే అంబరాన్ని తాకుతారు. మట్టిలో మాణిక్యాలున్నాయి కొంచెం గుర్తించండి ప్రోత్సహించండి అంటూ ఇతరులకు ఒక ఉదాహరణగా నిలుస్తారు. అలాంటి యువతి సక్సెస్ స్టోరీ ఈ రోజు తెలుసుకుందాం..  హర్యానాకు చెందిన పింకీ హర్యాన్ చిన్నతనంలో తన తల్లిదండ్రులతో కలిసి వీధుల్లో భిక్షాటన చేసింది. మెక్లీడ్‌గంజ్‌లోని చెత్త కుప్పల్లో ఆహారం కోసం వెదికేది. ఆ చిన్నారి బాలిక ఇరవై సంవత్సరాల తర్వాత డాక్టర్ గా మారింది. చైనీస్ డాక్టర్ డిగ్రీ పొందిన పింకీ ఇప్పుడు భారతదేశంలో మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి అర్హత సాధించే పరీక్షలో క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది. బిక్షాటన నుంచి డాక్టర్ చదువు వరకూ పింకీ ప్రయాణానికి సంబందించిన స్టోరీలోకి వెళ్తే..

2004లో టిబెటన్ శరణార్థి సన్యాసి, ధర్మశాలకు చెందిన ఛారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ లోబ్సాంగ్ జమ్యాంగ్ దృష్టిలో పింకీ హర్యాన్ భిక్షాటన చేస్తున్న సమయంలో పడింది. కొన్ని రోజుల తర్వాత చరణ్ ఖుద్ వద్ద ఉన్న మురికివాడను లోబ్సాంగ్ జమ్యాంగ్ సందర్శించారు. అక్కడ బిక్షాటన చేస్తున్న బాలికను గుర్తించాడు. అప్పుడు ఆ బలిక తల్లిదండ్రులను, ముఖ్యంగా ఆమె తండ్రి కాశ్మీరీ లాల్‌ని ఒప్పించి.. పింకీ దృష్టిని చదువు వైపు మరలేలా చేశాడు. పింకీ చదువుకోడానికి లోబ్సాంగ్ జమ్యాంగ్ పింకీ తండ్రిని ఒప్పించడానికి ఎన్నో గంటల సమయం తీసుకున్నాడు. చివరికి కాశ్మీర్ లాల్ తన కూతురు చదువుకునేందుకు ఒప్పుకున్నాడు.

ధర్మశాలలోని దయానంద్ పబ్లిక్ స్కూల్‌లో పింకీకి అడ్మిషన్ పొందింది. నిరుపేద పిల్లల కోసం 2004లో ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన హాస్టల్‌లో మొదటి బ్యాచ్ స్టూడెంట్స్ లో పింకీ ఒకరు.
గత 19 సంవత్సరాలుగా జమ్యాంగ్‌తో అనుబంధం ఉన్న NGO ఉమంగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు అజయ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. మొదట్లో పింకీ తన ఇల్లు, తల్లిదండ్రులను కోల్పోయినట్లు భావించింది. అయితే తర్వాత తాను చదువుకుంటే పేదరికం నుంచి బయటపడవచ్చు అని గ్రహించి చదువుపై దృష్టి పెట్టింది.

ఇవి కూడా చదవండి

పింకీ అంకితభావానికి రుజువు.

చదువుకోవడం ఒక తపస్సులా చేసింది. సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణులవ్వడమే కాదు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్ గ్రాడ్యుయేట్)లో కూడా ఉత్తీర్ణులయ్యింది. నీట్ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రయత్నం చేసింది. అయితే విపరీతమైన ఫీజుల కారణంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుకోవడం పింకీ కి వీలుకాలేదు. అదే సమయంలో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని టోంగ్-లెన్ ఛారిటబుల్ ట్రస్ట్ సహాయంతో పింకీ 2018లో చైనాలోని ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందింది. MBBS కోర్సు పూర్తి చేసి ఇటీవలే ధర్మశాలకు తిరిగి వచ్చిందని శ్రీవాస్తవ చెప్పారు. 20 సంవత్సరాల నిరీక్షణ తర్వాత పింకీ హర్యాన్ నిరుపేదలకు సేవ చేయడానికి, వారికి మెరుగైన జీవితాన్ని అందించడానికి అర్హత కలిగిన వైద్యురాలు అయింది.

చిన్నప్పటి నుండి పేదరికంతో అతిపెద్ద పోరాటం చేసినట్లు తాను పాఠశాలలో చేరిన తర్వాత జీవితంలో విజయం సాధించాలనే ఆశయం తనకు ఏర్పడింది అని పింకీ చెప్పింది. అంతేకాదు చిన్నప్పుడు, మురికివాడలో నివసించాను కనుక తన నేపథ్యమే తనకు అతిపెద్ద ప్రేరణ అని .. తాను ఆర్థికంగా స్థిరమైన జీవితాన్ని కోరుకున్నాను” అని గుర్తు చేసుకుంది. అంతేకాదు చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ తాను స్కూల్ లో జాయిన్ అయ్యే సమయంలో నాలుగేళ్ల వయస్సు అని .. ప్రవేశ ఇంటర్వ్యూలో డాక్టర్ కావాలనే తన కోరికను వ్యక్తం చేసినట్లు గుర్తుచేసుకుంది. అప్పుడు అసలు తనకు డాక్టర్ ఏ పని చేస్తారో కూడా తెలియదు. అయితే ఎప్పుడూ తాను తనవారికి సహాయం చేయాలని కోరుకున్నాను.. అందుకనే డాక్టర్ చదివినట్లు చెప్పింది పింకీ.. చైనాలో వైద్య విద్య పూర్తి చేసుకున్న పింకీ ఇప్పుడు భారతదేశంలో వైద్యం చేయడానికి అర్హత సాధించడానికి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (FMGE) కోసం సిద్ధమవుతోంది.

పింకీని స్పూర్తిగా తీసుకుని పింకీ సోదరుడు, సోదరి పాఠశాలలో చేరారు. మురికివాడ నుంచి డాక్టర్ గా ఎదిగిన పింకీ విజయగాథకు జమ్యాంగ్‌ అందించిన చేయూత ఇప్పుడు అందరి దృష్టిలో పడింది.
నిరుపేద పిల్లలకు ప్రాథమిక విద్యను అందించి గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వాలనే ఆశతో తాను ట్రస్టును ఏర్పాటు చేసినట్లు జమ్యాంగ్ తెలిపారు. అయితే ఈ చిన్నారుల్లో ఇంత టాలెంట్‌ ఉందని.. రోల్ మోడల్స్‌గా మారి ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారని తాను అనుకోలేదని చెప్పారు. పిల్లలను డబ్బు సంపాదించే యంత్రాలుగా పరిగణించకూడదని జమ్యాంగ్ విశ్వసిస్తున్నట్లు శ్రీవాస్తవ చెప్పారు. చిన్నతనం నుంచి పిల్లలు మంచి మనుషులుగా మారేలా ప్రోత్సహించాలని చెప్పారు.

 

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..