Telangana: ఆ కుక్క కోసం ఊరంతా ఒక్కటయ్యారు.. ఎందుకో తెలుసా!

ములుగు జిల్లా వెంకటాపురం మండలం అప్పలవారివీధిలో ఊరంతా ఒక్కటయ్యారు. కర్రలతో వెంటాడి ఆ వీధి కుక్కను కొట్టి చంపి కసి తీర్చుకున్నారు. ఇంతకీ ఆ గ్రామస్తుల ఆగ్రహానికి కారణం ఏంటి..? నేరమని తెలిసిన కూడా ఎందుకు కుక్కను చంపి కసి తీర్చుకున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే! అయితే మూగజీవులను హతమార్చడం నేరమని తెలిసినప్పటికీ, ఈ కుక్క తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లడం వల్లే హతమార్చమంటున్నారు

Telangana: ఆ కుక్క కోసం ఊరంతా ఒక్కటయ్యారు.. ఎందుకో తెలుసా!
Stray Dog

Edited By:

Updated on: May 02, 2025 | 6:57 PM

ములుగు జిల్లా వెంకటాపురం మండలం అప్పలవారివీధిలో ఊరంతా ఒక్కటయ్యారు. కర్రలతో వెంటాడి ఆ వీధి కుక్కను కొట్టి చంపి కసి తీర్చుకున్నారు. ఇంతకీ ఆ గ్రామస్తుల ఆగ్రహానికి కారణం ఏంటి..? నేరమని తెలిసిన కూడా ఎందుకు కుక్కను చంపి కసి తీర్చుకున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు.. ఓ పిచ్చి వెంకటాపురం మండలం అప్పలవారి వీధిలో ఊరందరినీ ఉలిక్కి పడేలా చేసింది. గ్రామంలో ఒక్కసారిగా స్వైర విహారం చేసిన ఆ వీధి కుక్క.. ఏకంగా 14 మందిని రక్కి గాయపరిచింది. కొందరి కండలు పీకేసింది. చిన్న పిల్లలు, వృద్దులు, పెద్దవాళ్లపై కూడా విచక్షణారహితంగా రక్కి గాయాల పాలు చేసింది. ఆ కుక్కకు కనిపించిన వారిని కనిపించినట్లే కండలు పీకేస్తుండడంతో.. కొద్దిసేపు ఊరంతా ఉలిక్కిపడింది. కుక్కకాటుతో గాయపడ్డ వారంతా ఆసుపత్రికి పరుగులు పెట్టారు. దీంతో గ్రామస్తులంతా కర్రలు పట్టుకుని కుక్కను పొలిమేరల వరకు తరిమారు. కానీ మళ్ళీ ఆ కుక్క గ్రామంలోకి ప్రవేశించి వరుసగా రక్కి గాయపర్చడంతో ఊరంతా ఒక్కటై కర్రలతో తరిమికొట్టారు. ఆ కుక్కను వెంటాడి వేటాడి హతమార్చి కసి తీర్చుకున్నారు.

అయితే మూగజీవులను హతమార్చడం నేరమని తెలిసినప్పటికీ, ఈ కుక్క తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లడం వల్లే హతమార్చమంటున్నారు. ఊరందరికీ వరుసగా రక్కి గాయపరచడంతో విధిలేని పరిస్థితిలో తమను తాము రక్షించుకోవడం కోసమే ఆ మూగజీని హతమార్చమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కకాటుతో గాయపడ్డ వారంతా ప్రస్తుతం వెంకటాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు