Solar Eclipse 2021: ఆకాశంలో మరో అద్భుతం జరగబోతోంది. అలాంటి అద్భుతాలను చూడాలని ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాదిలో నాలుగు గ్రహాలు ఉండగా, ఇందులో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు. మూడు గ్రహాలు ఇప్పటికే సంభవించగా, ఇప్పుడు మరో సూర్యగ్రహణం సంభవించనుంది. సంభవించనున్నాయి. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం డిసెంబర్ 4న సంభవించనుంది. ఈ సూర్య గ్రహణం దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో కనిపిస్తుందని, భారత్‌లో కనిపించదని ఖగోళ శాస్త్రవేత్తులు చెబుతున్నారు. అయితే భారత కాలమాన ప్రకారం.. డిసెంబర్ 4, ఉదయం 10.59 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 3.07 గంటలకు ముగియనుందని తెలిపారు.
సూర్యుడు.. భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల చంద్రుడి నీడ భూమిపై పడినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ ఏడాదిలో నాలుగు గ్రహాలు వచ్చాయి. మే 26 – సంపూర్ణ చంద్రగ్రహణం, జూన్ 10- వార్షిక సూర్యగ్రహణం, నవంబర్ 19- పాక్షిక చంద్రగ్రహణం, డిసెంబర్ 4- సంపూర్ణ సూర్యగ్రహణం. ఈ గ్రహణం కారణంగా కొన్ని నిమిషాలు ఆకాశం చీకటిగా మారిపోయి రాత్రిని తలపించేలా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇవి కూడా చదవండి: