Surrogate Mother : స్వలింగ సంపర్కుడైన సోదరుడి కోసం సరోగసీ తల్లిగా మారిన సోదరి.. భర్త అడ్డుచెప్పడంతో ఏం చేసిందంటే..

|

Mar 01, 2021 | 5:43 AM

Surrogate Mother : ఆరోగ్య సమస్యల వల్ల సహజంగా తల్లిదండ్రులు కాలేనివారు.. కృత్రిమంగా బిడ్డకు పొందడానికి ప్రయత్నిస్తారు. అలాంటి కృత్రిమ

Surrogate Mother : స్వలింగ సంపర్కుడైన సోదరుడి కోసం సరోగసీ తల్లిగా మారిన సోదరి.. భర్త అడ్డుచెప్పడంతో ఏం చేసిందంటే..
Follow us on

Surrogate Mother : ఆరోగ్య సమస్యల వల్ల సహజంగా తల్లిదండ్రులు కాలేనివారు.. కృత్రిమంగా బిడ్డకు పొందడానికి ప్రయత్నిస్తారు. అలాంటి కృత్రిమ గర్భధారణ విధానంలో సరోగసీ ఒకటి. భార్య అండాన్ని.. భర్త వీర్యాన్ని కలిపి.. మరో మహిళ గర్భంలో ప్రవేశపెడతారు. సాధారణంగా పిల్లలు కనాలనుకునే వారికి పరిచయం లేని వ్యక్తులు సరోగసి తల్లులు అవుతుంటారు. కానీ, అమెరికాలో ఓ మహిళ స్వలింగ సంపర్కుడైన తన సోదరుడి కోసం సరోగసీ తల్లిగా మారింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

మాంచెస్టర్‌లో నివసించే ఆంథోని డీగాన్‌.. రే విలియమ్స్‌ స్వలింగసంపర్కులు. గతకొంత కాలంగా వీరిద్దరు తండ్రులుగా మారాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం గర్భం అద్దెకి ఇచ్చే సరోగసీ తల్లి కోసం వెతికారు. కానీ, ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆంథోని డీగాన్‌ సోదరి 42 ఏళ్ల ట్రేసీ హుల్సే సరోగసీ తల్లిగా మారేందుకు సిద్ధపడింది. దీంతో ఆమె గర్భంలోకి ఆంథోని, విలియమ్స్‌ వీర్యాన్ని, పరిచయం లేని ఇద్దరు మహిళల అండాలను ఐవీఎఫ్‌ విధానంలో ట్రేసీ గర్భంలోకి ప్రవేశ పెట్టారు. రెండుసార్లు విఫలం కాగా.. మూడో సారి గర్భం నిలిచింది. మొదట ట్రేసీ భర్త వయసు దృష్ట్యా సమస్యలు తలెత్తుతాయని అడ్డు చెప్పాడట. కానీ, భర్తకు సర్దిచెప్పి సరోగసీ తల్లిగా మారింది. కొన్ని నెలల కిందట ట్రేసీ ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆంథోని.. విలియమ్స్‌ తండ్రులుగా మారడం కోసం దాదాపు రూ. 40లక్షలు ఖర్చు చేశారు. సోదరి గర్భం ద్వారానే తండ్రి అయినందుకు ఆంథోని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. గతంలోనూ ఓ వృద్ధురాలు తన కూతురు మాతృత్వాన్ని పొందాలని తానే సరోగసీగా తల్లిగా మారి వార్తల్లోకి ఎక్కింది. సరోగసీ విధానంలో అరుదుగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో ‘క్రాక్ జయమ్మ’.. పొలిటికల్ లీడర్‌గా తడాఖా చూపనున్న తమిళ లేడీ విలన్..