Cow Milk for Babies: చంటి పిల్లలకు ఆవు పాలు ఇవ్వకూడదా.. తాగతే ఏం జరుగుతుంది?

| Edited By: Ram Naramaneni

Nov 29, 2023 | 9:50 PM

చంటి పిల్లలకు కనీసం ఏడాది లేదంటే రెండు సంవత్సరాల వరకు తల్లి పాలు ఇవ్వాలని ఇంట్లో పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. మరోవైపు వైద్యులు కూడా కనీసం సంవత్సరం పాటైనా తల్లి పాలు ఇవ్వడం మంచిదని సూచిస్తూ ఉంటారు. కానీ ఒక్కోసారి తల్లికి పాలు పడవు. అలాగే తల్లి పాలు బిడ్డకు పడక పోయినా, బిడ్డకు తల్లి పాలు వంట పడకపోయినా చాలా మంది.. చంటి పిల్లలకు ఆవు పాలు పట్టిస్తూ ఉంటారు. కానీ ఏడాది లోపు చిన్న పిల్లలకు ఆవు పాలు అస్సలు ఇవ్వ కూడదని..

Cow Milk for Babies: చంటి పిల్లలకు ఆవు పాలు ఇవ్వకూడదా.. తాగతే ఏం జరుగుతుంది?
పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా, శీతాకాలంలో ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచడంతోపాటు ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొంతమంది బాదం, ఖర్జూరం వేడి పాలతో కలిపి తింటుంటారు. మరికొందరు చిటికెడు పసుపు లేదా దాల్చిన చెక్క పొడిని పాలల్లో కలుపుకుని తాగుతారు. పాలల్లో పంచదారకు బదులు తేనెను కలుపుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.
Follow us on

చంటి పిల్లలకు కనీసం ఏడాది లేదంటే రెండు సంవత్సరాల వరకు తల్లి పాలు ఇవ్వాలని ఇంట్లో పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. మరోవైపు వైద్యులు కూడా కనీసం సంవత్సరం పాటైనా తల్లి పాలు ఇవ్వడం మంచిదని సూచిస్తూ ఉంటారు. కానీ ఒక్కోసారి తల్లికి పాలు పడవు. అలాగే తల్లి పాలు బిడ్డకు పడక పోయినా, బిడ్డకు తల్లి పాలు వంట పడకపోయినా చాలా మంది.. చంటి పిల్లలకు ఆవు పాలు పట్టిస్తూ ఉంటారు. కానీ ఏడాది లోపు చిన్న పిల్లలకు ఆవు పాలు అస్సలు ఇవ్వ కూడదని.. అవసరం అయితే గేదె పాలు ఇవ్వొచ్చని వైద్యులు చెబుతూ ఉంటారు.

జీర్ణ సమస్యలు తలెత్తుతాయి:

నెలల పిల్లల్లో జీర్ణ వ్యవస్థ అనేది చాలా సున్నితంగా ఉంటుంది. అలాంటి సమయంలో చంటి పిల్లలకు ఆవు పాలు ఇవ్వడం వల్ల అవి సరిగ్గా అరగక.. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల కడుపులో నొప్పి, ఉబ్బరం, గ్యాస్, అజీర్తి, వాంతులు, వికారం వంటి సమస్యలు వస్తాయి. అందుకే డాక్టర్లు ఆవు పాలు అస్సలు ఇవ్వకూడదని చెబుతారు.

డయేరియా, లూజ్ మోషన్స్ అవుతాయి:

ఆవు పాలల్లో ప్రోటీన్, పొటాషియం, కాల్షియం, సోడియం, కేలరీలతో పాటు లాక్టోజ్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. అలాగే మందంగా, క్రీమీగా కూడా ఉంటాయి. వీటిని అరిగించుకోవడం పిల్లలకు కష్టంగా మారుతుంది. వీటిని నెలల పిల్లలకు ఇవ్వడం వల్ల డయేరియా, లూజ్ మోషన్స్ అయ్యే ప్రమాదం ఉంది. అంతే కాకుండా డీహైడ్రేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. వీటిని ఏడాది లోపు పిల్లలకు పట్టడం వల్ల వారు భవిష్యత్తులో.. ఊబకాయం, బరువు సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది .

ఇవి కూడా చదవండి

సరిగ్గా నిద్ర పట్టదు:

అంతే కాకుండా ఆవు పాలల్లో ఉండే ఎంజైమ్స్.. పిల్లల నిద్రకు ఆటంకాన్ని కూడా కలిగిస్తాయి. వారు సరిగ్గా నిద్ర పోక ఇబ్బంది పడుతూ ఏడుస్తూ ఉంటారు. చిన్న పిల్లలకు ముఖ్యంగా విటమిన్ – ఇ, ఐరన్ వంటివి అవసరం అవుతాయి. ఇవి ఆవు పాలల్లో తక్కువగా ఉంటాయి. ఇవి ఇవ్వడం వల్ల ఐరన్ లోపం ఏర్పడుతుంది. దీంతో రక్త హీనత సమస్యకు గురవ్వాల్సి ఉంటుంది. అందుకే ఏడాది పిల్లలకు ఆవు పాలకు బదులు.. తల్లి పాలే లేదా గేదె పాలను, పిండి పాలను ఇవ్వాలని నిపుణులు చెబుతూ ఉంటారు.

అప్పుడప్పుడు ఇవ్వొచ్చు..

అయితే ఏడాది నిండిన పిల్లలకు అప్పుడప్పుడు ఆవు పాలు ఇవ్వడం వల్ల.. కాల్షియం లోపం ఏర్పడదు. దీని వల్ల ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి. మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. శారీరక ఎదుగుదలకు కూడా ఉపయోగ పడతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.