Cow: చీర సాయంతో గోమాత ప్రాణం ఎలా కాపాడారో చూడండి…

ఆవు ఈనిన వెంటనే వచ్చే ప్రమాదకర సమస్యల్లో గుడ్లమాయ (గర్భాశయ జారడం) ఒకటి. ఈ సమయంలో గర్భాశయం బయటికి వస్తే ఆలస్యం చేయకుండా తక్షణ జాగ్రత్తలు తీసుకోవాలి. శుభ్రమైన చీరతో తాత్కాలికంగా సపోర్ట్ ఇవ్వడం ద్వారా మరింత నష్టం ఆపవచ్చు. ..

Cow: చీర సాయంతో గోమాత ప్రాణం ఎలా కాపాడారో చూడండి...
Cow Rescue

Updated on: Feb 13, 2026 | 10:12 AM

ఆవులు ఈనిన తర్వాత ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో గుడ్లమాయ (గర్భాశయ జారడం) ఒకటి. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. డెలివరీ అయిన వెంటనే శరీరం బలహీనంగా మారడం, గర్భాశయ కండరాలు సడలిపోవడం, అలాగే కాల్షియం లోపం వంటి కారణాల వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిలో గర్భాశయం బయటికి వచ్చేసినప్పుడు, ఆవుకు వెంటనే సరైన సంరక్షణ అందించకపోతే రక్తస్రావం, ఇన్ఫెక్షన్, షాక్ వంటి ప్రమాదాలు పెరిగిపోతాయి. అందుకే ఇది పూర్తిగా ఎమర్జెన్సీ కేస్ అని గుర్తుంచుకోవాలి.

దిగున వీడియోలో చూపిన విధంగా, గర్భాశయం బయటికి వచ్చినప్పుడు శుభ్రమైన చీర లేదా గుడ్డతో తాత్కాలికంగా సపోర్ట్ ఇవ్వడం ద్వారా అది నేలపై లాగబడకుండా, మరింత డ్యామేజ్ కాకుండా కొంతవరకు ఆపవచ్చు. అయితే ఇది పూర్తిస్థాయి చికిత్స కాదు. కేవలం పశువైద్యుడు వచ్చేంతవరకు ఆవును కాపాడేలా చేసే తాత్కాలిక ఉపశమనం మాత్రమే. అలాగే, గుడ్లమాయ వచ్చినప్పుడు చాలాసార్లు శరీరంలో కాల్షియం స్థాయి తగ్గి ఉండే అవకాశం ఉంటుంది. అందుకే పరిస్థితిని బట్టి పశువైద్యుని సూచన మేరకు వెంటనే కాల్షియం జెల్ లేదా అవసరమైన కాల్షియం చికిత్స ఇవ్వడం ఆవు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే.. గుడ్లమాయ సమస్య ఇంట్లో పూర్తిగా పరిష్కరించేది కాదు. తప్పకుండా వెంటనే పశువైద్యుడిని సంప్రదించి, వారి పర్యవేక్షణలోనే చికిత్స చేయించాలి. సరైన సమయంలో తీసుకునే చర్యలు ఆవు ప్రాణాలను కాపాడగలవు. ఇలాంటి పరిస్థితి కనిపించిన వెంటనే ఆలస్యం చేయొద్దు. ఒక్క నిమిషం కూడా ఆవు ప్రాణానికి కీలకం కావచ్చు.

Also Read: అందుకే ఫామ్‌లో గిన్ని కోళ్లను పెంచాలి అనేది..ఇవి చూడండి ఏం చేశాయో