Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాక రెగ్యులర్ మందులు వాడొచ్చా. ? డాక్టర్ల సూచనలు ఎంటంటే..

|

Apr 26, 2021 | 11:48 AM

Corona Vaccination: కరోనా సెకండ్ వేవ్... భారత్‏ను వణికిస్తోంది. ఆరడుగుల నెల దొరక్క అవస్థలు పడుతున్నారు.

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాక రెగ్యులర్ మందులు వాడొచ్చా. ? డాక్టర్ల సూచనలు ఎంటంటే..
Medicine Tablets
Follow us on

Corona Vaccination: కరోనా సెకండ్ వేవ్… భారత్‏ను వణికిస్తోంది. ఆరడుగుల నెల దొరక్క అవస్థలు పడుతున్నారు. స్మశనాలకు సైతం హౌస్ ఫుల్ అని బోర్డు పెట్టే రోజులు కనిపిస్తున్నాయి. కరోనా సృష్టిస్తున్న మారణహోమం నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే.. టీకా పంపిణీ కూడా వేగవంతం చేశాయి. అయితే ఈ టీకా గురించి పలు అపోహాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక జబ్బుల పేషెంట్లు తమ రెగ్యులర్ మందులను వేసుకోవచ్చా ? అనే సందేహాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే డాక్టర్లు సూచినలిస్తున్నారు.

టీకా తీసుకున్నాక కూడా కేన్సర్, ఇతర దీర్ఘకాలిక జబ్బుల పేషెంట్లు తమ రెగ్యులర్ మందులను క్రమం తప్పకుంకడా ఉపయోగించాల్సి ఉంటుంది. ఇలా మందుల వాడకంపై ఆంక్షాలేమి లేవు. టీకా తీసుకున్నాక డాక్టర్లతో సహా చాలా మందికి జ్వరం, ఒళ్ళు నొప్పులు వంటివి వస్తున్నాయి.. కొందరికైతే 2, 3 రోజుల పాటైనా ఈ లక్షణాలు తగ్గడం లేదు. అందువల్ల పారాసిటమాల్‌ ఇతర పెయిన్‌ కిల్లర్లు వాడాల్సి వస్తోంది. అయితే ఈ మందులు వాడడం వలన ప్రయోజనాలున్నాయి.. కానీ ప్రమాదాలు లేవని నిపుణులు సూచిస్తున్నారు. క్యాన్సర్ బాధితుల్లో కీమో, ఆపరేషన్ రేడియేషన్ ఇతర ట్రీట్ మెంట్ తీసుకుంటున్నవారు, ఇతరులు టీకా తీసుకోవచ్చు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి వ్యాక్సిన్ ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలున్నాయి. తీవ్రమైన గుండె జబ్బులున్నవారు ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలున్న వారికి కూడా టీకా వద్దన్న అభిప్రాయాలు ఉన్నాయి. కోవిడ్‌ వ్యాధి రక్తాన్ని గడ్డ కట్టిస్తోంది కాబట్టి టీకా వేసుకున్నాక కూడా కార్డియక్‌ పేషెంట్లు రక్తాన్ని పలుచగా చేసే మందులు ఆపకుండా కొనసాగించాల్సిందే. వాటిని వేసుకోకుండా ఉండడం వలనే పేషెంట్లకు సమస్యలు వస్తున్నాయి. తరచూ చేతులు కడుక్కోవడం, శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరం వంటివి కేన్సర్ పేషెంట్లతో సహా అందరూ తప్పనిసరిగా పాటించాల్సిందే. కేన్సర్ పేషెంట్లు తగిన జాగ్రత్తలు తీసుకుని చికిత్సను కొనసాగించాలి. లేకపోతే శరీరంలో వ్యాధి వ్యాప్తి మరింత పెరగవచ్చు. దానివల్ల ప్రమాదం పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: SBI ఖాతాదారులరా అలర్ట్.. కస్టమర్లకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్.. ఏం చెప్పిందంటే..

సుకన్య సమృద్ధి యోజన 2021: పోస్టాఫీసులో వడ్డీ రేట్లు చెక్ చేయండిలా.. ప్రయోజనాలెంటో తెలుసా..