Indian Railway: మీరు రైలులో ప్రయాణించాలంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే జరిమానా మాత్రమే కాదు జైలుకు కూడా వెళ్లాల్సి రావొచ్చు. అంతేకాదు ఒకరి టికెట్ పై మరొకరు ప్రయాణించినా శిక్షార్హులవుతారు. అందుకే రైలు ఎక్కేముందు ఒకసారి టికెట్‌ని పూర్తిగా చదవాలి. ప్రతి ప్రయాణికుడు పూర్తి విషయాలు తెలుసుకోవాలి.
ఒకరి పేరు మీద టికెట్ బుక్ చేసి వారి స్థానంలో మరొకరు ప్రయాణించడం తప్పు. ఇటీవల రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మరొక వ్యక్తి పేరు మీద రైలులో ప్రయాణించడం శిక్షార్హమైన నేరం అని తెలిపింది. అలాగే ఎల్లప్పుడూ సరైన టిక్కెట్లతో మాత్రమే ప్రయాణించాలని సూచించింది. మీరు వేరొకరి టికెట్‌పై ప్రయాణించలేరని తెలుసుకున్నారు కానీ కుటుంబానికి సంబంధించి వేరే నియమం ఉంది మీ కుటుంబ సభ్యుడు టిక్కెట్‌పై ప్రయాణించే వెసులుబాటున రైల్వే కల్పించింది. కానీ మీరు ఎవరి టిక్కెట్‌పై ప్రయాణిస్తున్నారో వారు మీకు రక్త సంబంధీకులై ఉండాలి. ఉదాహరణకు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, జీవిత భాగస్వామి లేదా పిల్లల పేరిట టికెట్ ఉంటే మీరు వారి టికెట్‌పై సులువుగా ప్రయాణించవచ్చు.
ఒకవేళ మీరు వేరే కుటుంబ సభ్యుల టికెట్‌పై ప్రయాణించాలంటే నియమం వేరుగా ఉంటుంది. దీని కోసం మీరు ఒక ప్రక్రియను అనుసరించాలి. ప్రయాణీకుడు మొదట టిక్కెట్‌లో పేరును మార్చుకోవాలి. అంటే రైలులో ప్రయాణించాల్సిన వ్యక్తి పేరు నమోదు చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో పాటు, భారతీయ రైల్వే ఏదైనా విద్యాసంస్థల విద్యార్థులకు టికెట్ బదిలీ సౌకర్యాన్ని అందిస్తుంది. అటువంటి పరిస్థితిలో బయలుదేరడానికి 48 గంటల ముందు అవసరమైన పత్రాలతో లెటర్‌హెడ్‌పై ఇనిస్టిట్యూట్ హెడ్ రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకుంటే రైల్వే అధికారులు పరిశీలిస్తారు.
किसी अन्य व्यक्ति के नाम की टिकट पर रेल यात्रा करना दंडनीय अपराध है।
हमेशा उचित टिकट लेकर ही यात्रा करें। pic.twitter.com/3wP5SIAm6r
— Ministry of Railways (@RailMinIndia) August 26, 2021