Women Iftar: మసీదులో మహిళల ఇఫ్తార్ పార్టీ.. కుల మతాలకు అతీతంగా హాజరు

ఈ రంజాన్‌ మాసం హైదరాబాద్‌లో ఒక ప్రత్యేకమైన ఇఫ్తార్ పార్టీకి సాక్ష్యంగా నిలిచింది. ఇది పూర్తిగా మహిళలు నిర్వహించిన మహిళల ఇఫ్తార్ పార్టీ. టోలీచౌకీ ఇస్లామిక్ సెంటర్ మసీద్ మహిళల ఇఫ్తార్ పార్టీకి వేదికయ్యింది. ఈ ఇఫ్తార్ విందులో సుమారు 100మందికి పైగా మహిళలు మాత్రమే పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం మహిళలు హాజరయ్యారు. ఎంతో మంది స్త్రీలు మొదటిసారి హాజరైన ఈ రమజాన్ ఇఫ్తార్‌ను జీవితంలో చిరస్మరణీయమైన సందర్భమని చెప్పారు.

Women Iftar: మసీదులో మహిళల ఇఫ్తార్ పార్టీ.. కుల మతాలకు అతీతంగా హాజరు
Women Iftar Party

Edited By:

Updated on: Mar 24, 2024 | 2:59 PM

ఈ రంజాన్‌ మాసం హైదరాబాద్‌లో ఒక ప్రత్యేకమైన ఇఫ్తార్ పార్టీకి సాక్ష్యంగా నిలిచింది. ఇది పూర్తిగా మహిళలు నిర్వహించిన మహిళల ఇఫ్తార్ పార్టీ. టోలీచౌకీ ఇస్లామిక్ సెంటర్ మసీద్ మహిళల ఇఫ్తార్ పార్టీకి వేదికయ్యింది. ఈ ఇఫ్తార్ విందులో సుమారు 100మందికి పైగా మహిళలు మాత్రమే పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం మహిళలు హాజరయ్యారు. ఎంతో మంది స్త్రీలు మొదటిసారి హాజరైన ఈ రమజాన్ ఇఫ్తార్‌ను జీవితంలో చిరస్మరణీయమైన సందర్భమని చెప్పారు.

ఈ చిన్నపాటి ఇఫ్తార్ కలయిక మత విద్వేషాలపై పోరాడేందుకు, మత సామరస్యాన్ని చాటిచెప్పేందుకు శక్తివంతమైన వేదిక అని పలువురు ముస్లిం మహళలుకితాబిచ్చారు. ఈ ఇఫ్తార్ పార్టీని నిర్వహించిన నసీమ్ సుల్తానా జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం నాయకురాలు. ఒకే వరుసలో కూర్చొని, ఒకే సమయానికి ఉపవాస దీక్ష విరమించిన తామంతా ఒక్కటేనని చాటిచెప్పారు. కులమతాల కతీతంగా పాల్గొన్న ఈ ఇఫ్తార్ విందులు మత సామరస్యాన్ని పెంపొందిస్తాయని నసీమ్ సుల్తానా పేర్కొన్నారు.

సహపంక్తి భోజనం చేయడం, సెల్ఫీలు దిగడం, కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం లాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ ఇఫ్తార్ హిందూ-ముస్లిమ్ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. రంజాన్ మాసంలో ఉపవాసం ప్రాముఖ్యత గురించి జెఐహెచ్ ఉమెన్స్ వింగ్ సీనియర్ మెంబర్ ఆయిషా సుల్తానా వివరించారు. ఈ మాసంలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఉపవాసం ఉండడం వల్ల మానసిక ప్రశాంతతతోపాటు అద్వితీయమైన ఆహ్లాదకరమైన అనుభూతి కలుగుతుందని పలువురు మహిళలు అభిప్రాయపడ్డారు. మతపరమైన రాజకీయాలను తిప్పికొట్టేందుకు ఇలాంటి ఇఫ్తార్ లు మరిన్ని జరగాలని అశించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..