Viral: బంగారు నగలతో ఉన్న బ్యాగ్ మిస్సింగ్.. ఎలుకల సాయంతో పట్టేసిన పోలీసులు.. సినిమాను మించిన రియల్ స్టోరి

|

Jun 18, 2022 | 2:08 PM

పోయిన వస్తువులను వెతికిపెట్టడంలో పోలీసులకు డాగ్స్ సాయం చేయడం ఇప్పటివరకు చూశాం. కానీ, ఇక్కడ ఎలుకలు ఆ పని చేశాయి.

Viral: బంగారు నగలతో ఉన్న బ్యాగ్ మిస్సింగ్.. ఎలుకల సాయంతో పట్టేసిన పోలీసులు.. సినిమాను మించిన రియల్ స్టోరి
Representative image
Follow us on

Trending: టైటిల్ చూడగానే… ఈ వార్త నిజమా, ఏదైనా ట్విస్ట్ చేస్తున్నారా అని అనుకుని ఉంటారు. ఇది పక్కా ట్రూత్. పోలీసులు ఇచ్చిన స్టేట్‌మెంట్.  అవును మాములుగా పోలీసులకు కుక్కలు హెల్ఫ్ చేయడం కామన్. అందుకోసం వాటికి ట్రైనింగ్ కూడా ఇస్తారు. కానీ ఇక్కడ ఎలుకలు కాప్స్‌కు సాయం చేశాయి. పోయిన 10 తులాల బంగారం కనిపెట్టేందుకు దారి చూపాయి. వివరాల్లోకి వెళ్తే…  ముంబై (Mumbai)దిండోశీ ప్రాంతంలోని ఆరే కాలనీకి చెందిన సుందరి పలనివేల్ ఇటీవల తమ కుమార్తెకు పెళ్లి చేశారు. ఈ క్రమంలో ఆ కుటుంబానికి కొన్ని అప్పులు అయ్యాయి. వాటిని తీర్చేందుకు ఇంట్లో ఉన్న గోల్డ్ తాకట్టు పెట్టాలనుకున్నారు. ఆర్నమెంట్స్ అన్నీ ఒక సంచిలో పెట్టి బ్యాంకుకు బయలుదేరారు. ఈ క్రమంలోనే ఇంట్లో మిగిలిన  వడాపావ్‌లు విషయం వారికి గుర్తుకు వచ్చింది. వాటిని కూడా ఓ సంచిలో వేశారు. ఈ క్రమంలో బ్యాంక్‌కు వెళ్లే రూట్‌లో ఓ అడుక్కునే మహిళ కనిపించింది. ఆమె వడాపావ్‌లు ఉన్న బ్యాగ్ ఇచ్చేశారు. అక్కడి నుంచి బ్యాంకు వెళ్లి చూడగా నగలను కూడా ఆ వడాపావ్ పెట్టిన బ్యాగులోనే పెట్టినట్లు సుందరి గుర్తించి.. ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆమె ఆ అడుక్కునే మహిళ ఉండే చోటుకు వెళ్లి వెతికారు. కానీ, ఆమె కనిపించకపోవడంతో దిండోశీ పోలిస్ స్టేషన్‌లో పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు.

స్టేషన్  పోలీస్ ఆఫీసర్ సూరజ్ రౌత్ తన టీమ్‌తో కలిసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు.  సీసీ కెమెరాల ఫీడ్ ఆధారంగా.. ఆ యాచకురాలిని పట్టుకోగలిగారు. అయితే, వడాపావ్‌లు బాగా పాడవ్వడంతో వాటిని అక్కడే చెత్తకుప్పపై పడేశానని ఆమె చెప్పింది. వెంటనే ఆ చెత్త కుప్ప వద్దకు చేరుకున్న పోలీసులు.. గాలింపు చేపట్టారు. కానీ అక్కడ ఎంత వెతికినా ఏం దొరకలేదు. దీంతో ఎవరికైనా నగలు దొరికాయేమో అన్న ఉద్దేశంలో.. ఆ చెత్త కుప్ప ఉన్న ప్రాంతంలోని సీసీ ఫుటేజ్ చెక్ చేశారు. ఎలుకలు ఆ సంచిని ఈడ్చుకంటూ వెళ్లడం గుర్తించారు. ప్రజంట్ కూడా అక్కడ ఎలుకలు ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. దీంతో అక్కడే ఉన్న ఎలుకలను పోలీసులు ఫాలో అయ్యారు వాటి వెనుకే కాలువ వైపు వెళ్లడంతో అక్కడే వడాపావ్‌ల సంచి కనిపించింది. ఆ సంచిలో బంగారు నగలు అలానే ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి సుందరికి  అప్పగించారు. ఆ నగల విలువ సుమారు రూ. 5 లక్షల ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇలా పోయిన ఆభరణాలను కనిపెట్టడంలో ఎలుకలు పోలీసులకు సాయపడ్డాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..