Bad Breath: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ 4 పదార్థాలు నమిలితే మటుమాయం..

|

Feb 21, 2022 | 3:46 PM

Bad Breath: ఉదయం లేవగానే నోటి నుంచి దుర్వాసన వస్తోంది. బ్రష్‌ వేయగానే ఫ్రెష్‌గా ఉంటుంది. కానీ కొంతమందికి అనారోగ్య పరిస్థితుల వల్ల తరచుగా

Bad Breath: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ 4 పదార్థాలు నమిలితే మటుమాయం..
Bad Breath
Follow us on

Bad Breath: ఉదయం లేవగానే నోటి నుంచి దుర్వాసన వస్తోంది. బ్రష్‌ వేయగానే ఫ్రెష్‌గా ఉంటుంది. కానీ కొంతమందికి అనారోగ్య పరిస్థితుల వల్ల తరచుగా నోటి నుంచి దుర్వాసన వస్తోంది. దీంతో వారు ఎవ్వరితో సరిగ్గా మాట్లాడలేరు. బయటికి రావాలంటే ఇబ్బందిపడుతారు. అలాంటి వారు సహజ పద్దతుల ద్వారా నోటి దుర్వాసనని దూరం చేసుకోవచ్చు. మన వంటింట్లో దొరికే ఈ నాలుగు పదార్థాలని వాడితే సరిపోతుంది.

1. లవంగాలు

లవంగాలను ఎక్కువగా వంటలలో వాడుతారు. ఇవి చక్కటి ఘాటు ఫ్లేవర్‌ని కలిగి ఉంటాయి. వీటిని నోటి దుర్వాసనకి విరుగుడుగా వాడవచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇది నోటిలో ఉండే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అలానే పంటి నుండి రక్తం కారడం లేదంటే ఇతర పంటి సమస్యలు ఉన్నా సరే సమస్య తొలగిపోతాయి. మీరు నోట్లో లవంగాలని వేసుకొని నమిలితే సరిపోతుంది.

2. నీళ్లు

తక్కువ నీళ్లు తీసుకునే వారిలో నోటి దుర్వాసన సమస్య ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధికంగా నీళ్లు తాగితే నోటిలో ఉండే బ్యాక్టీరియా బయటకు వచ్చేస్తుంది. నోటిని ప్రెష్‌గా ఉంచుతుంది. నోటి నుంచి బ్యాడ్‌ స్మెల్‌ వస్తే వెంటనే నీరు తాగండి. వీలుంటే నీటిలో నిమ్మకాయ రసం వేసి తాగితే ఇంకా మంచిది.

3. తేనే

తేనే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనికి కొద్దిగా దాల్చిన చెక్క కలిపి తీసుకుంటే దుర్వాసన వెంటనే మాయం అవుతుంది. ఈ రెండిట్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. తేనే, దాల్చిన పేస్ట్ ని నోటికి అప్లై చేసినట్లయితే దంత సమస్యలు తగ్గిపోతాయి. అలానే దంతాల నుంచి రక్తం కారడం దుర్వాసన వంటి సమస్యలు కూడా ఉండవు.

4. దాల్చిన చెక్క

దాల్చిని తియ్యగా, కొంచెం ఘాటుగా ఉంటుంది. బిర్యాని వంటకంలో దీనిని ఎక్కువగా వాడుతారు. చాలా మంది టీ చేసుకుని కూడా తాగుతారు. కరోనా కాలంలో చాలామంది దాల్చిన చెక్క టీని తీసుకున్నారు. ఇందు మంచి ఫ్లేవర్‌ ఉంటుంది. ఇది నోటి దుర్వాసన సమస్యను తొలగిస్తుంది. లవంగాలు లాగ దాల్చిన కూడా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది.

Iron Deficiency: ఐరన్‌ లోపంతో బాధపడుతున్నారా.. ఈ రెండు ఆహారాలు కలిపి తింటే చాలు..!

Weather: తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు.. రాత్రిపూట తగ్గిన చలి తీవ్రత.. హైదరాబాద్‌లో ఎలా ఉందంటే..?

ICC T20I Rankings: తగ్గేదేలే అంటున్న హిట్‌మ్యాన్‌ సేన.. ఆరేళ్ల తర్వాత టీమ్‌ ఇండియా ఘనత..