ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ సతీమణి ప్రసవం.. పండంటి మగబిడ్డ జననం..!

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ కోయ హర్ష సతీమణి విజయ డెలివరీ అయ్యారు. ఈ సందర్భంగా శస్త్ర చికిత్స చేసిన వైద్యులు కాన్పు చేశారు ఈ కాన్పులో రెండవ కొడుకుకు విజయ జన్మనిచ్చింది. కాగా తల్లి కొడుక సురక్షితంగా ఉన్నారని స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ అరుణ పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ సతీమణి ప్రసవం.. పండంటి మగబిడ్డ జననం..!
Peddapalli District Collector Koya Harsha's Wife Elivered At The Godavarikhani Government General Hospital

Edited By:

Updated on: Apr 27, 2025 | 5:46 PM

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ కోయ హర్ష సతీమణి విజయ డెలివరీ అయ్యారు.
ఈ సందర్భంగా శస్త్ర చికిత్స చేసిన వైద్యులు కాన్పు చేశారు ఈ కాన్పులో రెండవ కొడుకుకు విజయ జన్మనిచ్చింది. కాగా తల్లి కొడుక సురక్షితంగా ఉన్నారని స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ అరుణ పేర్కొన్నారు. కలెక్టర్ సతీమణి సాఫ్ట్ వేర్ అయినప్పటికీ మొదటి నుంచి గోదావరిఖని ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం వస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ దయాల్ సింగ్, గైనకాలజిస్ట్ డాక్టర్ అరుణ చెప్పారు.

మెడికల్ కాలేజ్ తోపాటు ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ దయాల్ సింగ్ పేర్కొన్నారు. ఇదే క్రమంలో కలెక్టర్ సతీమణి చికిత్స నిమిత్తం ఆస్పత్రి ఇక్కడికే వస్తున్నట్లు వివరించారు. అన్ని విభాగాల వైద్యులు, శస్త్రచికిత్సకు అవసరమైన అధునాతన పరికరాలు, మందులు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రి సేవలందిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరారు.

ఏకంగా జిల్లా కలెక్టర్ సతీమణి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందడం పట్ల అందరికి ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అధికారులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే.. అందరికి మరింత నమ్మకం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..