Paytm Cash Back: వంటగ్యాస్ పై భారీగా క్యాష్ బ్యాక్..800 రూపాయల వరకూ తగ్గింపు..పేటీఎం బంపర్ ఆఫర్..ఇలా పొందండి..

|

Jun 14, 2021 | 1:31 PM

Paytm Cash Back: నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి. వంట నూనెల దగ్గర నుంచి పెట్రోలు డీజిల్ వరకూ ప్రతీదీ ఇష్టం వచ్చినట్టు పెరిగిపోతోంది. వంటింట్లో వాడే ప్రతి వస్తువు ధరా ఆకాశాన్ని అంటుతోంది.

Paytm Cash Back: వంటగ్యాస్ పై భారీగా క్యాష్ బ్యాక్..800 రూపాయల వరకూ తగ్గింపు..పేటీఎం బంపర్ ఆఫర్..ఇలా పొందండి..
Paytm Cash Back
Follow us on

Paytm Cash Back: నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి. వంట నూనెల దగ్గర నుంచి పెట్రోలు డీజిల్ వరకూ ప్రతీదీ ఇష్టం వచ్చినట్టు పెరిగిపోతోంది. వంటింట్లో వాడే ప్రతి వస్తువు ధరా ఆకాశాన్ని అంటుతోంది. ఈ పరిస్థితిలో ఏదైనా ఒక వస్తువు తక్కువ ధరకు దొరికినా.. ఆ వస్తువుపై కొంత డిస్కౌంట్ వస్తుంది అని తెలిసినా ఇంట్రస్టింగ్ అనిపిస్తుంది. బడ్జెట్ లో కొద్దిగా మిగులు దొరికింది అనిపిస్తుంది. ఆ మేరకు పెద్ద ఊరట దొరికినట్టే. అదిగో అలంటి అవకాశమే ఇప్పుడు పేటీఎం ఇస్తోంది. నిత్యం ఉపయోగించే వంట గ్యాస్ సిలెండర్ పై భారీ కాష్ బాక్ ఆఫర్ ప్రకటించింది. అవును.. మీరు పేటీఎం యాప్ ద్వారా గ్యాస్ సిలెండర్ బుక్ చేస్తే 800 రూపాయల క్యాష్ బ్యాక్ వస్తుంది. దాదాపుగా సిలెండర్ పూర్తి ఉచితంగా లభించినట్టే. ఎందుకంటే, ఇప్పుడు ఎల్పీజీ సిలెండర్ ధర 815 రూపాయలు ఉంది. మీరు పేటీఎం ద్వారా గ్యాస్ బుక్ చేసుకుంటే కనుక మీకు 800 రూపాయలు వెనక్కి తిరిగి వచ్చేస్తాయి. మరి ఈ ఆఫర్ ఉపయోగించుకోవడం ఎలానో.. పూర్తి వివరాలు ఇక్కడ తెల్సుకోవచ్చు.

ఈ విషయాన్ని భారత్ గ్యాస్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. భారత్ గ్యాస్ క్యాష్ బ్యాక్ పై చేసిన ట్వీట్ ఇదే..

ఈ ఆఫర్ (Paytm Cash Back) ను పేటీఎం అందిస్తోంది. మొదటిసారి పేటీఎం ద్వారా గ్యాస్ బుక్ చేసుకునే వారికి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ పొందాలంటే ఇలా చేయాల్సి ఉంటుంది..

  • మీ ఫోన్‌లో పేటీఎం యాప్ లేకపోతే, ముందుగా డౌన్‌లోడ్ చేసుకోండి
  • ఇప్పుడు మీ ఫోన్‌లో పేటీఎం యాప్‌ను తెరవండి.
  • ఆపై రీఛార్జ్ చేసి బిల్లులు చెల్లించండి.
  • ఇప్పుడు ‘బుక్ ఎ సిలిండర్’ ఎంపికను తెరవండి.
  • దీని తరువాత ఇప్పుడు ఇండియా గ్యాస్ ప్రొవైడర్‌ను ఎంచుకోండి.
  • నమోదిత మొబైల్ నంబర్ లేదా మీ ఎల్‌పిజి ఐడిని అప్‌లోడ్ చేయండి.
  • మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది.. దానిని స్కాన్ చేసి, ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోండి.

Also Read: Discount on Rail Tickets: రైలు ప్రయాణీకులకు శుభవార్త..రిజర్వుడు టికెట్లపై డిస్కౌంట్..ఎంతో.. ఎలానో తెలుసుకోండి!

Soap Manufacturing : సబ్బుల తయారీతో సంవత్సరానికి 6 లక్షలు..! మోదీ ప్రభుత్వం రుణ సదుపాయం..? పూర్తి వివరాలు తెలుసుకోండి..