Smart Phone: మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ కు అతుక్కుపోతున్నారా.. అది వ్యసనంగా మారొచ్చు.. బీ అలర్ట్..

|

Oct 04, 2022 | 10:55 AM

ప్రెసంట్ జెనరేషన్ అంతా టెక్నాలజీతోనే ఫ్రెండ్షిప్ చేస్తోందని చెప్పవచ్చు. కరోనాకు ముందుతో పోలిస్తే కరోనా అనంతరం పరిస్థితులు విపరీతంగా మారిపోయాయి. చిన్నా పెద్దా ఆడా మగా అనే తేడా లేకుండా..

Smart Phone: మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ కు అతుక్కుపోతున్నారా.. అది వ్యసనంగా మారొచ్చు.. బీ అలర్ట్..
Smart Phone Addiction
Follow us on

ప్రెసంట్ జెనరేషన్ అంతా టెక్నాలజీతోనే ఫ్రెండ్షిప్ చేస్తోందని చెప్పవచ్చు. కరోనాకు ముందుతో పోలిస్తే కరోనా అనంతరం పరిస్థితులు విపరీతంగా మారిపోయాయి. చిన్నా పెద్దా ఆడా మగా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చి చేరాయి. ముఖ్యంగా టీనేజ్ లో ఉండే పిల్లలు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ యూజ్ చేసేందుకు అంట్రెస్ట్ చూపిస్తున్నారు. 11,875 మంది పిల్లల ఆరోగ్యం, మానసిక వికాసానికి సంబంధించిన విషయాలపై చేసిన అధ్యయనంలో శాస్త్రవేత్తలు కీలక విషయాలు తెలుసుకున్నారు. వారిలో 47.5% మంది యుక్త వయస్కులు వారు తమ ఫోన్‌లను ఎంతగా ఉపయోగిస్తున్నారనే దాని గురించి ట్రాక్ చేయలేకపోతున్నారని చెప్పారు. అయితే.. అబ్బాయిల కంటే అమ్మాయిలే సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ వాడకం వల్ల లైఫ్ స్టైల్, ఫుడ్ లో మార్పులు వచ్చాయి. సెల్ ఫోన్ చేతిలో వచ్చినప్పటి నుంచి కడుపు నిండా తినడమే మానేస్తున్నారని గుర్తించారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం, శరీర తీరు కోసం ప్రమాదకరమైన పద్ధతులు, మందులను ఉపయోగించే అవకాశం ఉందని సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్ వ్యసనం పెరిగిపోతుందనడానికి ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఒక వ్యక్తి తన ఫోన్ లేకుండా ఉండాలనే ఆలోచనతో బాధపడటం, దానిని ఉపయోగించనప్పుడు వారి ఫోన్ గురించి ఆలోచించడం, పనులకు అంతరాయం కలిగించడం, ఫోన్ కోసం ఇతరులతో గొడవ పడటం వంటివి లక్షణాలు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్ వాడకం నిద్రను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే తగినంత నిద్ర మానసిక స్థితి, జ్ఞానం, ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ మితిమీరిన వినియోగం మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సోషల్ మీడియా, వీడియో కాల్‌లు సామాజిక సంబంధాన్ని కలిగిస్తున్నప్పటికీ వాటి ద్వారా కలిగే నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పిల్లలు స్మార్ట్ ఫోన్ వ్యసన బారిన పడకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. వారితో మాట్లాడాలి. ఇలాంటి సంభాషణలు వారికి సంబంధ బాంధవ్యాలు, భాషా నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. తల్లిదండ్రులు భోజనం చేసేటప్పుడు, మాట్లాడే సమయంలో ఫోన్‌లను దూరంగా ఉంచాలి. ఎందుకంటే పెద్దవాళ్లు ఏం చేస్తారో పిల్లలు కూడా అదే చేస్తారు. కాబట్టి ముందుగా మనలో మార్పు వచ్చాక పిల్లల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలి. అంతే కాకుండా స్క్రీన్ వినియోగాన్ని పరిమితం చేయాలి. నిద్రపోయే ముందు వారి ఫోన్లను వాడకుండా జాగ్రత్త పడాలి. నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయడం, నైట్‌స్టాండ్ నుంచి ఫోన్‌ను దూరంగా ఉంచడం, ఫోన్ ను సైలెంట్ లో గానీ, వైబ్రేట్ లో గానీ ఉంచాలి. ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం ద్వారా క్రమంగా స్మార్ట్ ఫోన్ల వ్యసనాన్ని తగ్గించుకోవచ్చు.