Old is Gold: అప్పట్లో అలా..తాజ్ హోటల్ ఒకరోజుకి ఛార్జ్..ఫియట్ మొదటి కారు ఖరీదు ఎంతో తెలుసా?

|

Aug 07, 2021 | 9:21 PM

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాట ఎప్పుడూ వినేదే. సాధారణంగా ఎప్పుడూ గతకాలమే బావుంది అనిపిస్తుంది. వర్తమానంలో మనకి ఏమీ బాగోలేదు అనిపించింది భవిష్యత్తులో మంచిగా కనిపించవచ్చు.

Old is Gold: అప్పట్లో అలా..తాజ్ హోటల్ ఒకరోజుకి ఛార్జ్..ఫియట్ మొదటి కారు ఖరీదు ఎంతో తెలుసా?
Old Is Gold
Follow us on

Old is Gold: ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాట ఎప్పుడూ వినేదే. సాధారణంగా ఎప్పుడూ గతకాలమే బావుంది అనిపిస్తుంది. వర్తమానంలో మనకి ఏమీ బాగోలేదు అనిపించింది భవిష్యత్తులో మంచిగా కనిపించవచ్చు. అదేవిధంగా మనకీ గతంలో విషయాలు అద్భుతంగా గోచరించవచ్చు. కాకపోతే ధరల విషయానికి వస్తే.. మాత్రం అప్పట్లో వస్తువుల ధరలు తెలిసినపుడు.. ఇప్పటి ధరలతో పోల్చి చూసుకుని ఎంత తేడా అనుకోవడం పరిపాటి. ఇదంతా ఎందుకంటే.. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా రెండు విషయాలను ఇప్పుడు షేర్ చేశారు. ట్విట్టర్ లో ఆయన షేర్ చేసిన ఆ విషయాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అవి ఏమిటంటే..

మొదటిది..

దేశంలోని అత్యుత్తమ ఫైవ్ స్టార్ హోటళ్ళలో ఒకటి అయిన ముంబయిలోని తాజ్ హోటల్ ప్రారంభం సందర్భంగా ఇచ్చిన ప్రకటన. దీనిలో తాజ్ హోటల్ లో ఒక రాత్రికి 6 రూపాయలు రుసుము అని పేర్కొని ఉంది. ఈ హోటల్ తటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్‌సేట్జీ నుసర్వంజి టాటా ప్రారంభించారు. దీని ప్రారంభ సమయంలో ఒక రాత్రి ఈ హోటల్ లో బస చేయాలంటే ఆరు రూపాయలు తీసుకునేవారు. ఈ హోటల్ 1903 డిసెంబర్ 1న ప్రారంభం అయింది. అంటే, ఇది ప్రారంభం అయ్యి ఇప్పటికి దాదాపు 117 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు దేశంలో.. వ్యాపారాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. అవన్నీ పక్కనపెడితే.. కేవలం ఆరు రూపాయలు అనే దగ్గరే అందరి ఆలోచనలూ ఆగిపోతాయి. కదా. మొత్తం మీద పాత విషయాల్ని ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేసి సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెరతీశారు. అంతే కాదు ఈ ట్వీట్ తో పాటు ఆయన అందరికీ ఓ సూచనా చేశారు.. ”ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది. టైమ్ మెషీన్‌లోకి వెళ్లి తిరిగి వెనక్కి వెళ్లండి.” అంటూ ఆయన చేసిన సూచన కూడా నెటిజన్లకు భలే నచ్చేసింది.

ఆనంద్ మహీంద్రా చేసిన ఆ ట్వీట్ ఇక్కడ మీరూ చూసేయండి..

రెండోది..

ఇంతకు ముందు..ఆనంద్ మహీంద్రా కూడా ఫియట్ 1100 పాత ప్రకటన చిత్రాన్ని షేర్ చేశారు. ఈ ప్రకటనలో ఆ ఫియట్ కారు ధర ఎంతో తెలుసా? కేవలం 9,750 రూపాయలు. (ఈ ధర ఎక్స్-ఫ్యాక్టరీ ఎక్స్‌క్లూజివ్ అన్ని పన్నులు కలుపుకుని). ఈ కారు 1950 లలో భారతీయ రహదారిపై నడిచింది. భారతదేశంలో ఈ కారు ప్రవేశంతో క్రమంగా ఫియట్ ఆటోమొబైల్ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు సంపాదించుకోవడానికి దారితీసింది. ఫియట్ అనే పేరు కార్లకు పర్యాయపదంగా మారేంతగా ప్రజాదరణ పొందింది ఈ కారు. ఈకారు 108bcc 4-సిలిండర్ ఇంజిన్‌తో వచ్చింది. ఇది 36bhp శక్తిని ఉత్పత్తి చేయగలదు. వాహనాన్ని ఆధునిక కార్లతో పోల్చడం సరైనది కాకపోయినా, అప్పట్లో కారు అంత తక్కువకు వచ్చేదా అని అనిపిస్తుంది.

ఆనంద్ మహీంద్ర చేసిన ఈ ట్వీట్ కూడా ట్రేండింగ్ గా మారింది. ఈ ట్వీట్ ను ఇక్కడ మీరు చూడొచ్చు..

Also Read: Viral Photos : ఇండో-పాక్ విభజన సమయంలో అన్ని వస్తువులను సమానంగా పంచారు.. కానీ ఒక్కటి మాత్రం పాకిస్తాన్ అడగలేదు..

Breastfeeding: తల్లిపాలకు, ఇతర పాలకు తేడా ఏమిటి..?.. పరిశోధనలలో తేలిన విషయాలు..!