Octopus: మనిషిలానే ఆక్టోపస్‌కు నిద్రలో కలలు!..ఆసక్తికర విషయాలు వెల్లడించిన బ్రెజిల్ శాస్త్రవేత్తలు

|

Mar 27, 2021 | 1:41 PM

New Study on Octopus: సూపర్ స్మార్ట్ జంతువుల్లో ఆక్టోపస్ కూడా ఒకటని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది. సముద్ర జీవి ఆక్టోపస్‌కున్న అపారమైన మేధస్సును ...

Octopus: మనిషిలానే ఆక్టోపస్‌కు నిద్రలో కలలు!..ఆసక్తికర విషయాలు వెల్లడించిన బ్రెజిల్ శాస్త్రవేత్తలు
ప్రతీకాత్మక చిత్రం
Follow us on

సూపర్ స్మార్ట్ జంతువుల్లో ఆక్టోపస్ కూడా ఒకటని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది. సముద్ర జీవి ఆక్టోపస్‌కున్న అపారమైన మేధస్సును మన కళ్లకు కట్టే పలు వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా తిండి కోసం ఇతర జీవులను వేటాడే విషయంలో ఆక్టోపస్‌లు అత్యంత చాకచక్యాన్ని ప్రదర్శిస్తుంటాయి. ఇతర జీవులు బారి నుంచి తప్పించుకునే విషయంలోనూ అంతే స్మార్ట్‌గా వ్యవహరిస్తాయి. తాజాగా ఆక్టోపస్‌లపై జరిపిన ఓ పరిశోధనలో వాటికి సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఆక్టోపస్‌లు మనిషిలాగే నిద్రలో కలలు కంటాయని నిర్ధారించేందుకు అవసరమైన ఆధారాలు లభించినట్లు బ్రెజిల్‌కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. అక్టోపస్‌లపై తాము జరిపిన పరిశోధనలో తేలిన అంశాలను ఐసైన్స్‌ పత్రికలో వారు ప్రచురించారు.

అత్యాధునిక సాంకేతిక పరికరాలు, కెమరాలు కలిగిన ల్యాబ్‌లో నాలుగు రకాల సాధారణ ఆక్టోపస్‌లను ఉంచి ఈ పరిశోధన జరిపారు. ఆక్టోపస్‌ల కదలికలను రాత్రింబవళ్లు కొన్ని రోజుల పాటు కెమరాల్లో రికార్డు చేశారు. దాదాపు 180 గంటల వీడియో ఫూటేజీని విశ్లేషించిన శాస్త్రవేత్తలు…పగటి వేళల్లో సగం సమయానికి పైగా అవి నిద్రపోయినట్లు గుర్తించారు. ఈ అధ్యయనంలో మనిషిలానే ఆక్టోపస్‌లు కూడా నిద్రలో రెండు దశలను ప్రదర్శించటాన్ని గుర్తించారు. ఆక్టోపస్‌లు గాఢ నిద్రలో ఉన్నప్పుడు వైబ్రేటర్‌ ద్వారా వాటిని కదిలించేందుకు ప్రయత్నించినా…అవి స్పందించలేదట.

నిద్రలో రంగులు మార్చిన ఆక్టోపస్‌లు..
ప్రధానంగా ఆక్టోపస్‌లు రంగును మార్చుకోవడం, శరీర కదలికలు, కళ్ల కదలికలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్నారు పరిశోధకులు.  నిద్రలో కలలు రావడంతోనే ఆక్టోపస్‌లు రంగు మార్చుకుంటున్నట్లు భావిస్తున్నట్లు తమ పరిశోధన నివేదికలో వెల్లడించారు. నిద్రిస్తున్న సమయంలో ఆక్టోపస్‌ల మెదడులో ఎలాంటి మార్పులు కలుగుతున్నాయన్న అంశం ఆసక్తిరేపుతోంది. దీనిపై మరింత లోతైన పరిశోధనలు జరిపే యోచనలో ఉన్నట్లు బ్రెజిల్ పరిశోధకలు తెలిపారు.

 

ఇవి కూడా చదవండి: భారీ మొసలి వైట్ షార్క్ ని ఎలా పట్టేసిందో ! ఎర ఇక ‘నైస్’ ఫుడ్, క్వీన్స్ ల్యాండ్ వరదల్లో విచిత్రం !

తమలపాకు విశిష్టత మీకు తెలుసా..? కర్మకాండలు, పెళ్లిళ్లకు ఎందుకు వాడుతారు.. ఎప్పుడైనా ఆలోచించారా..?