Farmers: మే నెల ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉంది. అప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. పగటిపూట వేడిగాలులకి భయపడి జనాలు బయటకు వెళ్లడం లేదు. అంతేకాదు వేడి కారణంగా పంటలు కూడా ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితిలో జంతువులకి మేత లభించక అల్లాడుతున్నాయి. ఎండ వేడికి తట్టుకోలేక హీట్ స్ట్రోక్‌కు గురవుతున్నాయి. పెరిగిన ఎండల నుంచి జంతువులని రక్షించడానికి రైతులు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం. దేశంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలుల దృష్ట్యా పశుసంవర్ధక శాఖ రైతులకి పలు సూచనలు చేసింది. జంతువులు హీట్ స్ట్రోక్ గురైనట్లు తెలుసుకోవడానికి కొన్ని లక్షణాల గురించి తెలిపింది. వాటి ప్రకారం జంతువులకి తీవ్రమైన జ్వరం ఉంటే అవి వేడి స్ట్రోక్‌కు గురైనట్లు అర్థం చేసుకోవాలి. దీంతో పాటు జంతువు నోరు నుంచి ద్రావం కారడం, మేత మేయకపోవడం, చురుకుగా ఉండకపోవటం, ఎక్కువ నీరు తాగకపోవడం, మూత్రవిసర్జన ఆగిపోవడం మొదలైన లక్షణాలు ఉంటాయి. రైతులు 6 చర్యలు తీసుకోవడం ద్వారా పశువులు ఎండదెబ్బకి గురికాకుండా కాపాడుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.
1. జంతువులను వెంటిలేషన్ ఉన్న గృహంలో లేదా చెట్ల కింద మాత్రమే ఉండే విధంగా చూసుకోవాలి. మొత్తానికి ఎండ తగలకుండా చూసుకోవాలి.
2. జంతువులు ఉండే గది కిటికీలకి గోనె సంచులని నీటిలో ముంచి కట్టాలి. తరచుగా వాటిని నీటితో తడుపుతూ ఉండాలి. దీనివల్ల వేడి గాలి లోపలికి రాకుండా ఉంటుంది.
3. జంతువుల గృహంలో, ఫ్యాన్ లేదా కూలర్ ఉపయోగించాలి. వేడి కారణంగా జీవులకు నాలుగు, ఐదుసార్లు చల్లటి నీరు ఇవ్వాలి.
4. పశువులకు రోజుకు రెండుసార్లు చల్లటి నీటితో స్నానం చేయించడం ద్వారా అవి వేడిగాలుల నుంచి ఉపశమనం పొందుతాయి.
5. జంతువులను ఉదయం, సాయంత్రం ఆలస్యంగా మేతకు పంపాలి.
6. జంతువులు హీట్‌స్ట్రోక్ గురైతే ఒక్కసారి వైద్యుడికి చూపించాలి.