Surprise Gift To Employee: ఉద్యోగి ప్రతిభను మెచ్చిన కంపెనీ.. బహుమతిగా ఏం ఇచ్చిందో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..

|

Apr 01, 2021 | 7:58 PM

Noida Company Surprise Gift To Employee: సాధారణంగా ఎవరైనా ఉద్యోగి తాను పనిచేసే సంస్థ కోసం బాగా కష్టపడి పనిచేస్తే అతనికి కలిగే లాభమేంటి.? మార్చిలో వేసే హైక్‌లో కాస్త ఎక్కువ...

Surprise Gift To Employee: ఉద్యోగి ప్రతిభను మెచ్చిన కంపెనీ.. బహుమతిగా ఏం ఇచ్చిందో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..
Moon Land Gift For Emplyoee
Follow us on

Noida Company Surprise Gift To Employee: సాధారణంగా ఎవరైనా ఉద్యోగి తాను పనిచేసే సంస్థ కోసం బాగా కష్టపడి పనిచేస్తే అతనికి కలిగే లాభమేంటి.? మార్చిలో వేసే హైక్‌లో కాస్త ఎక్కువ శాతం వేస్తారు. ఇక కొన్ని కంపెనీల్లో అది కూడా ఉండదు. కేవలం ‘ఉత్తమ ఉద్యోగి’ అవార్డుతో సరిపెడుతుంటారు. అయితే నోయిడాకు చెందిన ఓ కంపెనీ మాత్రం తన ఉద్యోగి కోసం ఏ బహుమతి ఇచ్చిందో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ ఆ కంపెనీ ఉద్యోగికి ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసుకోవాలనుందా..? అయితే ఈ స్టోరీలోకివెళ్లాల్సిందే.

బిహార్‌లోని దర్భంగాకు చెందిన ఇఫ్తేకర్ రహమానీ అనే వ్యక్తి నోయిడాలో ఏఆర్ స్టూడియోస్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీని రన్ చేస్తున్నాడు. కృత్రిమ మేథ‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే ఇఫ్తకేర్ అమెరికాకు చెందిన ‘లునా సొసైటీ ఇంటర్నేషనల్’ అనే సంస్థ కోసం ఓ సాఫ్టవేర్‌ను రూపొందించాడు. ఈ సంస్థ చంద్రుడిపై భూములను అమ్ముతుంటుంది. ఈ సాఫ్ట్‌వేర్ సహాయంతో భూమిపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా సంస్థ. దీంతో తమ వ్యాపారానికి ఎంతో అనుకూలంగా ఉన్న సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినందుకు లునా సొసైటీ తమ ఉద్యోగికి ఏకంగా చంద్రుడిపై ఎకరం భూమిని బహుమతిగా ఇచ్చింది. దీంతో ఇఫ్తకేర్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. తమ ప్రాంతంలో జాబిలిపై స్థలాన్ని సొంతం చేసుకున్న తొలి వ్యక్తిగా ఇఫ్తకేర్ చరిత్రలోకెక్కడంతో ఆయన కుటుంబసభ్యులంతా గ్రామంలోని ప్రజలకు స్వీట్లు పంచుతూ ఫుల్ ఖుషీలో ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగవైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే.. భారత్‌కు చెందిన ప్రముఖ సెలబ్రెటీలపైన సుశాంత్ సింగ్ రాజ్ పుత్, షారుఖ్ ఖాన్, టీమిండియా మాజీ కెప్టెన్ మహీంద్ర సింగ్ ధోని కూడా జాబిల్లిపై స్థలం కొనుగోలు చేశారు. ఈ జాబితాలో ప్రస్తుతం ఇఫ్తకేర్ కూడా చేరడం విశేషం.

Also Read: మరోసారి నయనతారపై నోరు పారేసుకున్న రాధారవి.. కామెంట్స్‌పై కాలు రువ్వుతున్న తమిళనేతలు

West Bengal Election 2021: పోలింగ్ రోజే ఇక్కడ ప్రచారమేంటి?… ప్రధాని మోదీపై మమతా బెనర్జీ ఫైర్

ఢిల్లీలో తనకు పీఏలు ఎవరూ లేరు.. సీబీఐ దాడిపై స్పందించిన టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత