Nirmal District: జీవితాంతం కాడి మోసి, భుజం కాసిన ఎద్దుకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపిన రైతన్న

|

Feb 18, 2021 | 11:12 AM

రక్తసంబంధికులు చనిపోయినా కొందరు పంతాలతో లెక్క చేయరు. తెలిసిన వారు కాలం చేసినా కొందరు పాత గొడవలు, విబేధాలకే ప్రాధాన్యత ఇచ్చి..

Nirmal District:  జీవితాంతం కాడి మోసి, భుజం కాసిన ఎద్దుకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపిన రైతన్న
Follow us on

Nirmal District:  రక్తసంబంధికులు చనిపోయినా కొందరు పంతాలతో లెక్క చేయరు. తెలిసిన వారు కాలం చేసినా కొందరు పాత గొడవలు, విబేధాలకే ప్రాధాన్యత ఇచ్చి ఆఖరి చూపు కోసం కూడా వెళ్లరు. కానీ ఎన్నో ఏళ్లుగా ప్రేమతో పెంచుకున్న ఎద్దు మరణించిందని ఓ రైతు కన్నీరు మున్నీరయ్యాడు. ఆయన కుటుంబసభ్యులంతా కలిసి దానికి అంత్యక్రియలు కూడా నిర్వహించారు.

నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్ పాడ్ గ్రామంలో ఓ ఎద్దు చనిపోవడంతో హిందు సాంప్రదాయం ప్రకారం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాడు ఓ రైతు. వానల్ పాడ్ గ్రామానికి చెందిన రాంకుమార్ అనే రైతు పాడి ఆవుకు…21 ఏళ్ల క్రితం ఈ ఎద్దు జన్మించింది. అది కూడా పౌర్ణమి రోజు కావడంతో..అప్పటి నుండి తనకు వ్యవసాయంలో బాగా కలిసి వచ్చిందని, ఇప్పుడు ఆ ఎద్దు మరణించటంతో, ఆ రైతు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.

చనిపోయిన ఎద్దుకు శాస్త్రోక్తంగా హిందూ మత ఆచారాల ప్రకారం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించి దాని పట్ల తన  చాటుకున్నాడు రైతు. 21 ఏళ్ల పాటు తమ కుటుంబం సభ్యులతో పాటే కలిసి ఉన్న ఎద్దు చనిపోవటంతో ఆ ఇంట్లోని వారంతా దానికి కన్నీటి వీడ్కోలు తెలిపారు.

Also Read:

విచిత్ర వైద్యం.. పసరు మందుతో సంతానం కలుగుతుందని ప్రచారం.. అక్కడికి దంపతుల క్యూ

Snake in Scooty: మహిళ స్కూటీలో నక్కిన త్రాచుపాము.. దారిలో వెళ్తుండగా చేతికి మెత్తగా తగలడంతో..