వాహనాదారులరా అలర్ట్.. ఇకపై ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే అంతే సంగతులు.. ఏ ఏ తప్పుకు ఎంత కట్టాలో తెలుసా ?

బైక్ లేదా కార్ చేతిలో ఉందంటే చాలు.. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయి మరీ డ్రైవ్ చేస్తుంటారు. ఇక మనల్ని ఎల్లప్పుడు సీసీలు కనిపెడుతుంటాయని తెలిసినా పట్టించుకోకుండా డ్రైవ్ చేస్తుంటారు చాలా మంది.

వాహనాదారులరా అలర్ట్.. ఇకపై ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే అంతే సంగతులు.. ఏ ఏ తప్పుకు ఎంత కట్టాలో తెలుసా ?
Follow us
Rajitha Chanti

| Edited By: Team Veegam

Updated on: Feb 09, 2021 | 3:28 PM

New Traffic Rules: బైక్ లేదా కార్ చేతిలో ఉందంటే చాలు.. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయి మరీ డ్రైవ్ చేస్తుంటారు. ఇక మనల్ని ఎల్లప్పుడు సీసీలు కనిపెడుతుంటాయని తెలిసినా పట్టించుకోకుండా డ్రైవ్ చేస్తుంటారు చాలా మంది. మన టైం బాగాలేక ఎప్పుడైనా ట్రాఫిక్ పోలీసులకు దొరికితే.. అప్పుడు బయటపడతాయి మొత్తం వివరాలు. అసలు ఎన్ని చాలన్లు ఉన్నాయి… ఎంత కట్టాలని… ఇక ఆ సమయంలో ఒకేసారి భారీగా జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. అలా కాకుడదు అనుకుంటే ముందే ట్రాఫిక్ రూల్స్ ఏంటీ ? ఏ ఏ తప్పుకు ఎంత జరిమానా కట్టాలి అనే విషయాలను ముందుగా తెలుసుకోవడమే ఉత్తమం. మరీ మీకు ట్రాఫిక్ రూల్స్ తెలుసా ? మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ట్రాఫిక్ రూల్స్ ఎంటో ఇప్పుడు చూద్దాం.

ట్రాఫిక్ రూల్స్.. 

☛ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపితే రూ.5 వేల వరకు జరిమానా కట్టాల్సిందే. ☛ ఇక ఓవర్ స్పీడ్‏తో బండి నడిపితే రూ.1000 నుంచి రూ.2000 వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. ☛ మద్యం సేవించి బండి నడిపితే రూ.10 వేల వరకు జరిమానా కట్టాలి. ☛ టికెట్ లేకుండా జర్నీ చేస్తే రూ.500 వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ☛ ఇక బండి పర్మిట్ లేకుండా బండి నడిపితే రూ.10 వేల వరకు చెల్సించాల్సి ఉంటుంది. ☛ కమర్షియల్ వెహికల్స్ ఓవర్ లోడింగ్ అయితే దాదాపు రూ.2 వేల నుంచి రూ.20 వేల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. ☛ ఇక ప్యాసింజర్ వెహికల్స్ అయితే ఓవర్ లోడింగ్ ఉన్నట్లయితే అందులో ఒక్కోక్కరికి రూ.1000 చొప్పున ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ☛ ఇక లైసెన్స్ రూల్స్ బ్రేక్ చేస్తే అధికంగా రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా కట్టాల్సిందే. ☛ టూవీలర్ పైన అంటే బైక్, స్కూటర్ మీద ఇద్దరి కన్నా ఎక్కువ మంది వెళ్తే రూ.2 వేల ఫైన్‏తోపాటు మీ లైసెన్స్ మూడు నెలల వరకు రద్దయ్యే అవకాశం ఉంటుంది. ☛ ఇక అంబులెన్స్‏లకు దారి ఇవ్వకపోతే రూ.10 వేల ఫైన్ పడుతుంది. ☛ బైక్ పై వెళ్ళేప్పుడు హెల్మెట్ ధరించకపోతే రూ.1000 వరకు జరిమానా కట్టడంతోపాటు మూడు నెలలు లైసెన్స్ రద్దయ్యే అవకాశం ఉంటుంది. ☛ ఇన్సూరెన్స్ లేకుండా బండి నడిపితే రూ.2 వేల జరిమానా కట్టాలి. ☛ మైనర్ పిల్లలకు బండి ఇచ్చి.. వాళ్ళకు ఏదైనా ప్రమాదం జరిగేతే… ఇక అప్పుడు పెద్దవాళ్ళకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ బండి రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సల్ చేస్తారు.

Also Read: డెబిట్ కార్డ్, క్రేడిట్ కార్డ్ కస్టమర్లకు శుభవార్త.. ఆర్‏బీఐ కొత్త రూల్స్… జనవరి 1 నుంచి అమలులోకి