నేటి ప్రపంచంలో రోడ్డు ప్రమాదాలు అనేవి సర్వసాధారణంగా మారాయి. రోడ్డుపై లెక్కలేనన్ని వాహనాలు తిరుగుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. రోడ్డు ప్రమాదాల వల్ల చాలా మంది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లుతోంది. కొన్నిసార్లు ప్రమాదాల తీవ్రత ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే అవి మరణాలకు కూడా కారణమవుతున్నాయి. రోడ్డుపై జరిగే ప్రమాదాల్లో అత్యంత సాధారణ రకాలు హిట్ అండ్ రన్. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ ఒక వ్యక్తిని ఢీ కొట్టి అతని పరిస్థితి ఎలా ఉందో? పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోయినప్పుడు దాన్ని హిట్-అండ్-రన్‌గా పరిగణిస్తారు. ఈ విషయాన్ని క్రిమినల్ నేరంగా చూస్తారు. అలాగే ఈ తప్పును న్యాయపరంగా ఎదుర్కొన్నా జైలు శిక్షకు కారణం అవుతుంది. ఇలాంటి కేసులు ప్రధానంగా రెండు విభాగాలుగా విభజించారు. ఈ నేపథ్యంలో భారతీయ చట్టం ప్రకారం హిట్-అండ్-రన్ కేసుల్లోని వివిధ క్లాజుల గురించి ఓ సారి తెలుసుకుందాం.
రోడ్డు ప్రమాదం జరిగి అందులో ఎవరైనా మరణిస్తే పోలీసులు దర్యాప్తు చేసి ప్రమాదం జరిగిన సెక్షన్‌ను బట్టి రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు. భారతీయ చట్టం ప్రకారం ఒక సెక్షన్ 304, మరొకటి 304A. ఒక కేసులో రెండేళ్లు మాత్రమే శిక్ష, మరో కేసులో పదేళ్ల వరకు శిక్షగా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు రోడ్డు ప్రమాదాల్లో 304, 304ఏ కింద కేసులు నమోదు చేశామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. చాలా కేసుల్లో 304ఏ కింద మాత్రమే కేసు నమోదవుతుందని వివరిస్తున్నారు. సెక్షన్ 304 ఏ నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాలను కలిగి ఉంటుంది. ఈ కేసులో గరిష్ట శిక్ష కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే. సాధారణంగా పోలీసు స్టేషన్ ద్వారా బెయిల్ మంజూరు చేస్తారు. ఉదాహరణకు ఒక డ్రైవర్ రెడ్ లైట్ జంప్ చేసి వాహనం ముందుకు వస్తే ప్రమాదం జరిగిందనుకుంటే ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే అప్పుడు డ్రైవర్ నిర్లక్ష్యంగా ఉన్నాడని అర్థం.
304 అని పిలిచే మరో సెక్షన్ ప్రకరాం ఒక వ్యక్తి అతివేగంగా డ్రైవింగ్ చేసినా లేదా మద్యం సేవించి ప్రమాదానికి దారితీసిన మరణానికి దారితీస్తే అప్పుడు ఈ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేస్తారు. సెక్షన్ 279 నిర్లక్ష్యానికి, సెక్షన్ 338తో పాటు ప్రమాదకరమైన డ్రైవింగ్‌గా కేసులను నమోదు చేస్తారు. ఈ సెక్షన్ల ప్రకారం, నిందితుడికి పోలీస్ స్టేషన్ నుండి బెయిల్ లభించదు. అలాగే అతనికి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..