Name Correction And Profile Change In PF Account: సహజంగా పీఎఫ్ అకౌంట్‌లో పేరు సరిచేసుకోవడం లేదా ప్రొఫైల్ మార్పులను ఆన్‌లైన్‌లో చాలా సులభంగా చేసుకుంటాం. ఇది మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈపీఎఫ్‌ఓ (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే ఇకపై అభ్యర్థి వివరాలకు సంబంధించి ప్రధాన వివరాల మార్పులను ఆన్‌లైన్‌లో చేసుకునే వెసులుబాటును తొలగించినట్లు తెలిపింది. ఇలా ఆన్‌లైన్‌లో వివరాలను మార్చడం ద్వారా కొన్ని సందర్భాల్లో మోసాలకు దారితీసే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ కారణంగానే మెంబర్ ప్రొఫైల్ మార్పులకు అటు ఆన్‌లైన్, ఇటు ఆఫ్‌లైన్‌లో అత్యవసరమైతే తప్ప అనుమతించరు. ఈ క్రమంలో ఈపీఎఫ్‌ఓ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. అవేంటంటే..
* అభ్యర్థి తన ఇంటిపేరు, పేరు మార్పునకు సంబంధించిన వాటిని ఈపీఎఫ్‌ఓ మైనర్ కరెక్షన్స్‌గా విభాగంలో చేర్చింది.
* అదేవిధంగా అభ్యర్థి వివాహం తర్వాత ఇంటిపేరు మార్పు మార్పులు ఆధార్‌లో ఉన్న పేరు విధంగా మార్చుకోవచ్చని ఈపీఎఫ్‌ఓ కొత్త మార్గరద్శకాల్లో తెలిపింది.
* ఇక అభ్యర్థి పూర్తి పేరు మార్చడం లాంటి వాటిని సరైన డాక్యుమెంట్ ప్రూఫ్ లేకుండా ఆన్‌లైన్‌లో మార్చుకోవడడానికి వీలులేదు.
* ఒకవేళ యాజమాన్యం జాయింట్ డిక్లరేషన్‌పై సంతకం చేస్తే.. సంస్థ ఉద్యోగికి సంబంధించిన ఎంప్లాయ్ రిజిస్టర్, ఇంక్రిమెంట్ ఆర్డర్లు, పే స్లిప్, అపాయింట్ మెంట్ ఆర్డర్, పేరు మార్పునకు సంబంధించిన ఈపీఎఫ్ ఆఫీసుకు అందించిన ఏదైనా అప్లికేషన్ ఫామ్ ఒరిజినల్స్‌ను సమర్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్‌తో ధృవీకరణ చేసుకోవాల్సి ఉంటుంది.
* ఉద్యోగి లేదా సంస్థ అందించిన డాక్యుమెంటరీ ప్రూఫ్‌లను ఆడిట్ చేయడం కోస ఇంటర్నల్ ఆడిట్ పార్టీకి (ఐఏపీ) అందుబాటులో ఉంచాలని ఈపీఎఫ్‌లో పేర్కొంది. అంతేకాకుండా ఐఏపీకి 100 శాతం ఆడిట్ చేసే అధికారం కల్పించారు. దీంతో పాటు సీఏసీ (కాంకరంట్ ఆడిట్ సెల్) కూడా ఈ కేసులను పరిశీలించే అవకాశం కల్పించారు.
Also Read: State Bank Of India: ఒక్క మిస్డ్ కాల్‌తో పర్సనల్ లోన్ పొందొచ్చు.. ఎస్‌బీఐ అదిరిపోయే ఆఫర్.!