Saree Vs Jeans: కోడలిని జీన్స్ వేసుకోవాలని కోరిన అత్త.. చీరే కడతానన్న కోడలు! కోర్టు కెక్కిన పంచాయితీ..

| Edited By: Janardhan Veluru

Nov 21, 2023 | 2:47 PM

మోడ్రన్‌ దుస్తులు వేసుకునే అత్త, తన కోడలిని కూడా అలాంటి దుస్తులు వేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అయితే సదరు పల్లెటూరి కోడలు మాత్రం చీర మాత్రమే కట్టుకుంటానని మొండికేసింది. అత్తపోరు పడలేక కోడలు ఫ్యామిలీ కౌన్సిలింగ్​ సెంటర్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారం కాస్తా సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోనో ఆగ్రాలో ఈ సంఘటన వెలుగు చూసింది. ఉత్తర్​ప్రదేశ్‌లోని

Saree Vs Jeans: కోడలిని జీన్స్ వేసుకోవాలని కోరిన అత్త.. చీరే కడతానన్న కోడలు! కోర్టు కెక్కిన పంచాయితీ..
Jeans T Shirt
Follow us on

ఆగ్రా, నవంబర్‌ 21: మోడ్రన్‌ దుస్తులు వేసుకునే అత్త, తన కోడలిని కూడా అలాంటి దుస్తులు వేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అయితే సదరు పల్లెటూరి కోడలు మాత్రం చీర మాత్రమే కట్టుకుంటానని మొండికేసింది. అత్తపోరు పడలేక కోడలు ఫ్యామిలీ కౌన్సిలింగ్​ సెంటర్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారం కాస్తా సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోనో ఆగ్రాలో ఈ సంఘటన వెలుగు చూసింది. ఉత్తర్​ప్రదేశ్‌లోని ఆగ్రాలో అత్తాకోడళ్ల మధ్య జరిగిన గొడవ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.

ఆగ్రాలోని హరిపర్వత్​ పోలీస్​స్టేషన్​పరిధికి చెందిన ఓ యువకుడికి ఎత్మాద్​పుర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఉంటున్న యువతితో ఏడాది క్రితం వివాహం జరిగింది. యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. యువతి ఇంట్లోనే ఉంటోంది. జీన్స్​ అలవాటు లేని ఆ యువతి రోజూ చీరలే కట్టుకుంటోంది. అది నచ్చని ఆమె అత్త..కోడలిని జీన్స్‌, టీ షర్ట్‌ ధరించాలని హుకుం జారీ చేసింది. తనలాగే రోజూ జీన్స్ ధరించాలని నిత్యం పోరుపెట్టసాగింది. దీంతో విసిగెత్తిపోయిన కోడలు ఆదివారం (నవంబర్‌ 19) ఆగ్రా పోలీస్​స్టేషన్​లోని ఫ్యామిలీ కౌన్సిలింగ్​ సెంటర్‌ను ఆశ్రయించింది. జరిగినదంతా వారికి చెప్పి బోరుమంది. తనకు ఇష్టం లేకుండా తన అత్త జీన్స్‌ వేసుకోమంటోందని, ఈ విషయం భర్తకు చెబితే.. భర్త కూడా అత్తకు సపోర్ట్ చేస్తున్నాడని తెల్పింది. జీన్స్‌ వేసుకునేందుకు ఆమె నిరాకరించడంతో తన భర్త తనను కొట్టాడని ఆరోపించింది. ఫిర్యాదు అందుకున్న కౌన్సిలింగ్​ సెంటర్​ఆమెతో పాటు అత్త, భర్తను పిలిపించి భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు.

అయితే యువతి తాను గ్రామీణ వాతావరణం నుంచి వచ్చానని, పెళ్లి తర్వాత చీరలు కట్టుకోవడమే తనకు తెలుసని ఫ్యామిలీ కౌన్సిలింగ్​సెంటర్​అధికారులకు చెప్పింది. చీర కట్టుకోవడమే తనకు ఇష్టమని, కానీ అది తన అత్తకు ఇష్టంలేదని, చీర కట్టుకుంటే ఎగతాళి చేస్తోందని తెల్పింది. నిత్యం జీన్స్​వేసుకోమని ఇష్టం వచ్చినట్లు తిడుతుందని.. పైగా తన అత్త జీన్స్‌ ధరించడం తనకు ఇష్టం లేదని కూడా చెప్పింది. ఈ విషయం నా భర్తకు చెబితే తిరిగి నన్నే తిడుతున్నాడు, కొడుతున్నాడని కన్నీటిపర్యాంతమైంది. రోజూ ఇంట్లో తల్లి, భార్య మధ్య గొడవలతో విసిగిపోయానని, తల్లి మాట భార్య వినడం లేదని యువతి భర్త చెప్పుకొచ్చాడు. దీనిపై ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ నోడల్ ఏసీపీ సుకన్య శర్మ మాట్లాడుతూ.. ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించామని, వారు అంగీకరించకపోవడంతో కౌన్సిలింగ్​కు పిలిపించినట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.