Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాల్లో మరో ముందడుగు పడింది

|

Oct 18, 2021 | 12:30 PM

మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాల్లో మరో ముందడుగు పడింది. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ సెంటర్స్‌తో ప్రజలకు సేవ చేస్తోన్న చిరంజీవి...

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాల్లో మరో ముందడుగు పడింది
Chiru Charity
Follow us on

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాల్లో మరో ముందడుగు పడింది. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ సెంటర్స్‌తో ప్రజలకు సేవ చేస్తోన్న చిరంజీవి… వెబ్ సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్ ఓపెనింగ్ కార్యక్రమం హైదరాబాద్ లో అట్టహాసంగా జరుగింది. చిరంజీవి తన సర్వీసెస్‌కు టెక్నాలజీని జోడించారు. ఆక్సిజన్, బ్లడ్ అండ్ ఐ సేవలు వేగంగా అందేందుకు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ పేరుతో వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా దేశంలో ఎక్కడ్నుంచైనా సర్వీసెస్ పొందొచ్చని రామ్ చరణ్ తెలిపారు.

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించిన రామ్‌చరణ్ కీలక కామెంట్స్ చేశారు. ఇకపై డోనర్స్ నుంచి నిధులు తీసుకోనున్నట్లు ప్రకటించారు. ట్రస్ట్‌ను రీవోక్ చేశాక డొనేషన్స్ తీసుకుంటామని తెలిపారు. చిరంజీవి పర్సనల్‌ వెబ్‌సైట్‌ను కూడా రామ్‌చరణ్ ప్రారంభించారు. మెగాస్టార్ సినీ జీవితాన్ని ప్రజలతో పంచుకునేందుకు ఈ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. చిరంజీవి మూవీస్ డిటైల్స్, ఫొటోలు, పాటలు ఈ సైట్‌లో ఉంటాయి.

కాగా, కరోనా మహమ్మారి విజృంభించి తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్న సమయంలో ఆక్సిజన్ బ్యాంకు ద్వారా సేవలు అందించిన మెగా అభిమానులతో మెగాస్టార్ చిరంజీవి నిన్న భేటీ అయ్యారు. కరోనా మహమ్మారి రెండో దశ విరుచుకు పడుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో, జిల్లా స్థాయిలో ఆక్సిజన్ బ్యాంకు నెలకొల్పిన సంగతి తెలిసిందే..

చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు సేవలలో అన్ని జిల్లాల మెగా అభిమాన సంఘాల ప్రతినిధులు కూడా పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు తెలంగాణ జిల్లాల ఆక్సిజన్ బ్యాంకుల సేవలో పాల్గొన్న ప్రతినిధులను పిలిచి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనగా ఆయన కుడి చేతికి బ్యాండేజ్ లా ఉండడం అభిమానులందరినీ కలవరపెట్టింది.

ఏమైంది అని అభిమానులు చిరంజీవిని ప్రశ్నించగా చిరంజీవి అసలు విషయం చెప్పారు. తన అరచేతికి చిన్నపాటి సర్జరీ అయింది అనే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. కుడి చేతితో ఏ పని చేయాలన్నా కొంచెం నొప్పిగా, తిమ్మిరి ఏర్పడుతున్నట్టు అనిపించడంతో డాక్టర్ ను సంప్రదించానని వెల్లడించారు. ఇక, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్ ఓపెనింగ్ కార్యక్రమం హైదరాబాద్ లో అట్టహాసంగా జరుగుతోంది. ఆ కార్యక్రమం చూద్దాం..

Read also: Kesineni Nani: టీడీపీకి బిగ్ షాక్.. ఆఫీసులో చంద్రబాబు ఫోటోలు తీసేసిన కేశినేని నాని