“మాతృత్వంలోని మాధుర్యం తెలుసుకోవాలని ఉంది.. నా భర్తకు బెయిల్ ఇవ్వండి..” హైకోర్టులో మహిళ పిటిషన్

|

Aug 06, 2021 | 7:01 PM

ఉత్తరాఖండ్‌ హైకోర్టుకు పెద్ద ధర్మ సందేహమే కలిగింది. రేప్‌ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న తన భర్తకు పిల్లల్ను కనేందుకు షార్ట్ టర్మ్ బెయిల్ ఇవ్వాలంటూ..

మాతృత్వంలోని మాధుర్యం తెలుసుకోవాలని ఉంది.. నా భర్తకు బెయిల్ ఇవ్వండి.. హైకోర్టులో మహిళ పిటిషన్
Uttarakhand Woman
Follow us on

ఉత్తరాఖండ్‌ హైకోర్టుకు పెద్ద ధర్మ సందేహమే కలిగింది. రేప్‌ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న తన భర్తకు పిల్లల్ను కనేందుకు షార్ట్ టర్మ్ బెయిల్ ఇవ్వాలంటూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో తమకు సలహా ఇవ్వాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. వివరాల్లోకి వెళ్తే… ఉత్తరాఖండ్‌కు చెందిన సచిన్ అనే యువకుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ మైనర్ బాలికపై గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డాడు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. నేరం రుజువు అవ్వడంతో సచిన్‌తో పాటు మిగిలిన దోషులకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అయితే తన భర్తకు షార్ట్ టర్మ్ బెయిల్ ఇవ్వాలంటూ అతడి భార్య హైకోర్టును ఆశ్రయించింది. ఒక స్త్రీగా తనకు అమ్మతనంలోని మాధుర్యం తెలుసుకోవాలని ఉందని, ఇది భార్యగా తన హక్కు అని తన పిటిషన్‌లో విన్నవించింది. తన భర్తకు కొంతకాలం బెయిల్ ఇస్తే తాను గర్భం దాల్చేందుకు అవకాశం ఉంటుందని వేడుకుంది. అయితే ఎప్పుడూ కనని, వినని ఇలాంటి పిటిషన్‌ విషయంలో హైకోర్టుకు ధర్మ సందేహం కలిగింది. దీనిపై అభిప్రాయం తెలిపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

అత్యాచారం కేసులో దోషిగా నిరూపణ  జైలుశిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి ఈ కారణం చేత బెయిల్ ఇవ్వొచ్చా?..ఆమె ‘భార్యగా నా హక్కు’ అంటూ కోర్టును ఆశ్రయించింది. ఆమె హక్కులను గౌరవించి అతనికి బెయిల్ ఇస్తే వారికి కలిగే సంతానం కూడా వచ్చి ‘బిడ్డలుగా తండ్రితో కలిసి బ్రతికే హక్కు’ అనే అవకాశం ఉంది కదా.. అని హైకోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు తండ్రి లేని బిడ్డను తల్లి ఒక్కతే పోషించడం చాలా కష్టమైన విషయం.. ఈ క్రమంలో పిల్లలు కనడం కోసమే నిందితుడికి బెయిల్ ఇవ్వడం సబబేనా? అని కూడా ధర్మాసనం నిపుణుల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తోంది. తండ్రి లేకుండా పెరిగే బిడ్డల మానసిక ఆరోగ్యంపై గురించి కూడా కోర్టు ఆలోచిస్తుంది. ఇక ఇతర దేశాల్లో ఇలాంటి కేసులు ఏమైనా నమోదయ్యాయా..? ఒకవేళ అయితే అక్కడి కోర్టులు ఎలాంటి తీర్పులు ఇచ్చాయో అధ్యయనం చేయాలని ధర్మాసనం అధికారులను ఆదేశించింది.

Also Read: Vizag: పైనుంచి చూస్తే పక్కా పైనాపిల్ లోడే అనుకుంటారు.. లోపల చెక్ చేస్తే మైండ్ బ్లాంక్

ఆ ఊర్లో ఆదిమానవుడి జాడలు.. ఆసక్తి రేపుతోన్న అక్కడి సమాధులు