Mango Farming: మామిడి ప్రియులకు చేదు వార్త.. పండ్ల రారాజును మింగేస్తున్న తామర పురుగు

|

Mar 24, 2022 | 11:19 PM

మామిడి ప్రియులకు చేదు వార్త. వేసవి వచ్చింది.. కాని మామిడి దిగుబడి తగ్గింది. ఈసారి దేశంలో ఎండలే కాదు.. మామిడి ధరలు కూడా మండిపోతాయంటున్నారు వ్యాపారులు.

Mango Farming: మామిడి ప్రియులకు చేదు వార్త.. పండ్ల రారాజును మింగేస్తున్న తామర పురుగు
Mango Farming
Follow us on

నిన్న మిర్చి… నేడు మామిడి పంటను(mango farms).. తీవ్రంగా నష్టపరించింది తామర పురుగు. దానికి కాస్తా.. తేనేమంచు పురుగు కూడా తోడవ్వడంతో పూత దశలోనే పంటకు పూర్తిగా నష్టం వాటిల్లింది. ప్రతి ఏడాది మార్చి నుంచే మామిడి కోత దశకు వచ్చేవి.. వేసవి తరుణం దగ్గర పడుతున్న ఇప్పటికి పూత, పిందే నిలవకపోడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈఏడాది ఒంగోలు ఉలవపాడు మామిడి దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని.. దీంతో మామిడి రేటు మరింత ప్రియం అవుతందని రైతులు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 25 వేల ఎకరాల్లో సాగయ్యే ఉలవపాడు మామిడి ఈసారి పిందెలు కూడా కనిపించని పరిస్థితి కనపడక పోవడంతో ఈ వేసవి సీజన్‌లో ఎండలతో పాటు మామిడి ధరలు కూడా మండిపోయే అవకాశం లేకపోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మామిడి రైతులు.

ఇక ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఉలవపాడు మామిడి 16వ నెంబరు జాతీయరహదారిపై ఒంగోలు – కావలి కి మధ్య సుమారు 15 వేల ఎకరాలలో సాగవుతుంది. ఏడాదికి ఇక్కడ మామిడి పంటపై 100 కోట్ల రూపాయల వరకు టర్నోవర్‌ జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల మామిడి ఒంగోలు నుంచే ఎగుమతి అవుతుంది.

వేసవి దగ్గర పడుతున్నా.. దిగుబడి 20 శాతం కూడా కనిపించడం లేదు. ఇక మామిడి తోటలను లీజుకు తీసుకుని పండించే రైతుల కష్టాలు చెప్పలేనివి. రాలిపోతున్న పూతను కాపాడుకునేందుకు పురుగు మందులు విచ్చలవిడిగా వాడుతున్నారు రైతులు. భారీగా నష్టపోయామని.. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతులు.

ఎప్పుడు వస్తుంది..

మామిడిలో కాయతొలిచే పురుగులు జనవరి, ఫిబ్రవరి నుంచి మే వరకు పట్టేస్తుంది. ఇవి పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి. బఠాని సైజలు మామిడికాయ ఉన్న సమయం నుండి పెద్ద సైజు కు చేరే వరుకు ఏదశలోనైనా ఇది పంటను ఆశించే అవకాశం ఉంటుంది. కాయ ముక్కు భాగంలో నల్లటి రంధ్రంతో ఎండిన మామిడికాయ పిందెల గుత్తులు చెట్టుకు వ్రేలాడుతూ కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో ఈ పురుగు ఆశించిందన్న విషయం గుర్తించాలి.

ఇవి కూడా చదవండి: TS POLYCET 2022: తెలంగాణ పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే..

చక్కని శరీర సౌస్ఠవం.. చూపు తిప్పుకోలేని అందం.. నడకలో రాజసం.. అయినా కష్టమొచ్చింది..