Love Has No Boundaries: టూరిస్ట్‌గా వచ్చి ఇండియన్‌ అబ్బాయిని పెళ్లాడిన ఫ్రాన్స్‌ యువతి.. భారతీయ సంప్రదాయంలో వివాహం

Love Has No Boundaries: ప్రేమకు కులమత భేదం ఉండదు, ప్రాంతాలతో పని ఉండదు. అది ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు. ఖండాంతరాలు దాటి వచ్చి భారతీయ..

Love Has No Boundaries: టూరిస్ట్‌గా వచ్చి ఇండియన్‌ అబ్బాయిని పెళ్లాడిన ఫ్రాన్స్‌ యువతి.. భారతీయ సంప్రదాయంలో వివాహం
French Girl Indian Boy

Updated on: Nov 24, 2021 | 4:26 PM

Love Has No Boundaries: ప్రేమకు కులమత భేదం ఉండదు, ప్రాంతాలతో పని ఉండదు. అది ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు. ఖండాంతరాలు దాటి వచ్చి భారతీయ యువకుడి ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్న స్టోరీతో ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి. మరి ఆ సినిమాలే నిజ జీవితంలో దర్శనమిస్తే.. అది ఓ ఫ్రాన్స్‌ అమ్మాయి ప్రేమ కథ అవుతుంది. అవును బిహార్‌కు చెందిన ఓ అబ్బాయి ఫ్రాన్స్‌ అమ్మాయి ప్రేమలో పడిపోయాడు. అంతేకాదు హిందూ సంప్రదాయం ప్రకారం ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.

పారిస్‌కు చెందిన మేరీ లోరీ ఆరేళ్ల క్రితం ఇండియా పర్యటనకు వచ్చింది. అదే సమయంలో ఆమెకు ఢిల్లీలో టూరిస్ట్‌ గైడ్‌గా పనిచేస్తున్న రాకేష్‌ కుమార్‌ పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా స్నేహంగా మారింది… తర్వాత వారిరువురి మధ్య ప్రేమ చిగురించింది. ఇరువురు ఫోన్‌ నెంబర్లు మార్చుకున్నారు..మేరి ఫ్రాన్స్‌కు వెళ్లిపోయిన తర్వాత రాకేష్‌కి ఫోన్ చేసింది.. తనతోపాటు టెక్స్‌టైల్‌ బిజినెస్‌ చేసేందుకు ఫ్రాన్స్‌ రమ్మంటూ పిలిచింది. దాంతో ఫ్రాన్స్ వెళ్లిన రాకేష్ ఆమెతో కలిసి బిజినెస్‌ ప్రారంభించాడు. ఈ క్రమంలోనే వాళ్లిద్దరు ప్రేమలో పడ్డారు. నూరేళ్ల జీవితాన్ని కలిసి పంచుకోవాలనుకున్నారు. అంతేకాదు మేరీ భారతీయ సంప్రదాయం ప్రకారమే తమ పెళ్లి జరగాలని కోరింది. ఇందుకు ఆమె తన కుటుంబాన్ని కూడా ఒప్పించి పెళ్లి కోసం భారత దేశానికి తీసుకొచ్చింది. నవంబర్‌ 21న వీరిద్దరూ భారతీయ సంప్రదాయం ప్రకారం మూడుమూళ్ల బంధంతో ఒకటయ్యారు. ఫ్రాన్స్‌ వధువుని, కుటుంబాన్ని చూసేందుకు గ్రామస్తులు, స్థానిక జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

Also Read: ఉచిత రేషన్ పథకాన్ని మరో నాలుగు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం..