ప్రపంచంలోనే అతి పెద్ద కాన్వాస్ పెయింటింగ్.. ఎంత ధర పలికిందో తెలిస్తే షాక్ అవుతారు.!

|

Mar 25, 2021 | 5:13 PM

ఓ బ్రిటీష్ చిత్రకారుడు వేసిన పెయింటింగ్ ప్రపంచంలోనే అతి పెద్ద కాన్వాస్ పెయింటింగ్‌గా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా గిన్నీస్ బుక్‌లో కూడా చోటు దక్కించుకుంది..

ప్రపంచంలోనే అతి పెద్ద కాన్వాస్ పెయింటింగ్.. ఎంత ధర పలికిందో తెలిస్తే షాక్ అవుతారు.!
Painting
Follow us on

ఓ బ్రిటీష్ చిత్రకారుడు వేసిన పెయింటింగ్ ప్రపంచంలోనే అతి పెద్ద కాన్వాస్ పెయింటింగ్‌గా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా గిన్నీస్ బుక్‌లో కూడా చోటు దక్కించుకుంది. 17 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కాన్వాస్‌పై వేసిన ఈ పెయింటింగ్‌ దుబాయ్ వేలంలో ఏకంగా భారీ ధరకు అమ్ముడైపోయింది. ఇంతకీ ఎంత ధరకు అమ్ముడైందో ఇప్పుడు తెలుసుకుందాం…

బ్రిటన్‌కు చెందిన సాషా జాఫ్రి అనే చిత్రకారుడు ‘ది జర్నీ ఆఫ్ హ్యుమానిటీ’ పేరుతో రూపొందించిన ఈ పెయింటింగ్‌ను గీసేందుకు 1,065 పెయింటింగ్ బ్రష్‌లు, 6,300 లీటర్ల పెయింట్‌ను ఉపయోగించారు. దాన్ని పూర్తి చేసేందుకు సదరు చిత్రకారుడు ఏడు నెలల పాటు రోజుకు 20 గంటలు పని చేశాడట. ఇక ఈ పెయింటింగ్‌కు అతడు నిర్దేశించిన ధర రూ. 217 కోట్లు(32 మిలియన్ డాలర్లు) కాగా.. ఆశ్చర్యపోయే విధంగా దుబాయ్‌లో జరిగిన వేలంలో అది కాస్తా ఏకంగా రూ. 450 కోట్లకు(62 మిలియన్ డాలర్లు) అమ్ముడైంది.

ఈ పెయింటింగ్‌ను దుబాయ్ చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆండ్రీ అబ్డూన్ కొనుగోలు చేశాడు. ఈ విధంగా జాఫ్రి చిన్నారులకు సాయం చేస్తుండటం ఎంతో సంతోషాన్ని కలిగించిందని.. అతడు వేసిన ఫ్రేమ్స్‌ను విడదీయడం ఇష్టం లేక అన్నింటినీ తానే కొంటున్నట్లు తెలిపాడు. అలాగే పెయింటింగ్ విక్రయించగా వచ్చిన డబ్బును చిన్నారుల కోసం పాటుపడుతున్న స్వచ్చంద సంస్థలకు అందిస్తానని జాఫ్రి స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే గతంలో అమెరికాలోని మయామిలో నివసిస్తున్న ఓ ఆర్ట్ కలెక్టర్ 10 సెకన్ల ఆర్ట్ వీడియో కోసం రూ. 49.13 లక్షలు ఖర్చు చేయగా… అతడికి నక్క తోక తొక్కినట్లు.. ఆ వీడియో కాస్తా ఇప్పుడు రూ .48.42 కోట్ల సంపాదించి పెట్టిన సంగతి తెలిసిందే.

Also Read:

కసితో వేటాడిన సింహం.. మెరుపు దాడి చేసిన అడవి దున్న.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..

పోర్న్ చూస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన బాలుడు.. కిమ్ ఏం శిక్ష వేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!