
వాస్తు అనేది మన నిత్యజీవితంలో ప్రతి విషయంలోనూ వర్తిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం ఆడవారి పర్స్‌కు సంబంధించిన కొన్ని నియమాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పర్స్‌లో డబ్బులు ఉంచడం సాధారణ విషయం. కానీ, చాలా సార్లు మనం డబ్బులతో పాటుగా కొన్ని ఇతర అనవసరమైన వస్తువులను కూడా మోస్తుంటాం. అయితే ఇలా చేయడం మనల్ని అనుకోని ఖర్చులు, ఆర్థిక సమస్యలకు దారితీస్తుందట.
మహిళలు ఎల్లప్పుడూ తమ పర్సును శుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచుకోవాలి. ఇది ప్రతికూలతను తొలగించి సానుకూలతను తెస్తుంది. మీరు పర్స్‌లో పొరపాటున కూడా మందులు ఉంచుకోకూడదు. ఇది మీ పురోగతిని ఆపివేస్తుంది. అలాగే, చాలా సార్లు పాత బిల్లులు, రసీదులు లేదా పనికిరాని కాగితాలు పర్సులోనే ఉంటాయి. కానీ, వాటిని అలా పేరుకుపోనివ్వకండి. వెంట వెంటనే బయటపడేయటం మంచిది.
మహిళలు తమ పర్సులో చిరిగిన, పాత నోట్లను ఉంచుకోకూడదు. అది ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. తుప్పు పట్టిన పాత కీలు, నాణేలు లేదా లేడీస్ పిన్నులు డబ్బు ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బు కాకుండా పైన సూచించిన ఇలాంటి వస్తువులను మీ జేబులో ఉంచుకోవడం వల్ల మీ ఖర్చులు పెరుగుతాయట. ఇది మాత్రమే కాదు డబ్బు ప్రవాహానికి కూడా అంతరాయం ఏర్పడుతుందని, కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..