Donuts: 30 ఏళ్ల మహిళ వింత చోరీ.. 22 లక్షల విలువైన స్వీట్లను దొంగిలించి పరారీ

|

Dec 01, 2023 | 5:15 PM

నైపోస్ట్ ప్రకారం స్వీట్ టూత్ (స్వీట్స్ అంటే ఇష్టం ఉన్న) ఒక మహిళ తాజా డోనట్‌లతో నిండిన వ్యాన్‌ను దొంగిలించింది. ఆ మహిళ వయస్సు దాదాపు 30 ఉంటుందని తెలిపారు. ఓ సర్వీస్‌ స్టేషన్‌లో ఆగి ఉన్న వ్యాన్‌లోకి ప్రవేశించి ఆ వ్యాన్ ను తీసుకుని పారిపోయింది. వ్యాన్‌లో దాదాపు 10 వేల తాజా డోనట్స్ ఉన్నాయని.. వాటి విలువ 40 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (మన దేశ కరెన్సీలో 22 లక్షలకు పైగా) ఉంటుందని తెలిపారు.

Donuts: 30 ఏళ్ల మహిళ వింత చోరీ.. 22 లక్షల విలువైన స్వీట్లను దొంగిలించి పరారీ
Donuts
Follow us on

దొంగతనం గురించి చాలా మందికి తెలుసు.. కొందరు బంగారం నగలు, డబ్బులు వంటివి దొంగతనం చేస్తే.. టమాటా, ఉల్లిపాయలు వంటి కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకితే.. వాటిని కూడా దొంగలించిన సంఘటనలు గురించి తెలుసు. అయితే ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ వింత దొంగతనం జరిగింది. ఈ దొంతనం గురించి తెలిసిన తర్వాత అందరికి షాక్ కలిగించింది. ఓ దొంగ ఏ ఇంట్లోనూ లేదా షాప్ లోనూ ఏ  విలువైన వస్తువులను దొంగిలించలేదు. అయితే తాజాగా తయారు చేసిన డోనట్స్ ను దొంగిలించింది. ఈ  డోనట్స్ ధర రూ.22 లక్షలుగా చెబుతున్నారు.

నైపోస్ట్ ప్రకారం స్వీట్ టూత్ (స్వీట్స్ అంటే ఇష్టం ఉన్న) ఒక మహిళ తాజా డోనట్‌లతో నిండిన వ్యాన్‌ను దొంగిలించింది. ఆ మహిళ వయస్సు దాదాపు 30 ఉంటుందని తెలిపారు. ఓ సర్వీస్‌ స్టేషన్‌లో ఆగి ఉన్న వ్యాన్‌లోకి ప్రవేశించి ఆ వ్యాన్ ను తీసుకుని పారిపోయింది. వ్యాన్‌లో దాదాపు 10 వేల తాజా డోనట్స్ ఉన్నాయని.. వాటి విలువ 40 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (మన దేశ కరెన్సీలో 22 లక్షలకు పైగా) ఉంటుందని తెలిపారు. ఈ దొంగతనం సంఘటన న్యూ సౌత్ వేల్స్‌లోని న్యూకాజిల్ ప్రాంతంలో తెల్లవారుజామున 3 గంటలకు.. వ్యాన్ డ్రైవర్ సర్వీస్ స్టేషన్‌లో లావాదేవీలు జరిగిన సందర్భంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మహిళా దొంగ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగ పట్టుకునేందుకు సన్నాహాలు

క్రిస్మస్ పండగ సందర్భంగా తయారు చేసిన స్వీట్లతో పాటు కొన్ని సాధారణ డోనట్స్ కూడా దొంగలించబడ్డాయి. వీటిని ‘క్రిస్పీ క్రీమ్’ బేకరీ రానున్న క్రిస్మస్ పండుగ సీజన్‌లో అమ్మకమే లక్ష్యంగా తయారు చేసింది. క్రిస్మస్ డోనట్స్‌తో పాటు, వ్యాన్‌లో కొన్ని సాధారణ డోనట్స్ కూడా ఉన్నాయి. వీటిని కస్టమర్స్ కు డెలివరీ చేయవలసి ఉంది. ఇంతలో డోనట్స్ వాన్ దొంగలించబడింది. అయితే తమ కస్టమర్లను నిరాశపరచబోమని బేకరీ హామీ ఇచ్చింది. తమకు ఆర్డర్ ఇచ్చిన కస్టమర్స్ కు డోనట్స్ ను అందిస్తామని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

చోరీ ఘటనపై బేకరీ ఏం చెప్పిందంటే

ఈ ఘటనపై కంపెనీ స్పందిస్తూ “క్రిస్పీ క్రీమ్ చార్లెస్‌టౌన్‌లో కొనుగోలు చేయాలనుకునే లేదా ఆర్డర్ చేసిన కస్టమర్‌లు తమ డోనట్‌లను స్వీకరించగలరని.. ఈ విషయాన్ని తాము ప్రకటించడానికి సంతోషిస్తున్నామ” అని వెల్లడించింది. ఎందుకంటే మేము ఇప్పటికే స్టాక్‌ను భర్తీ చేసాము. దీనితో పాటు ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకున్నందుకు బేకరీ యాజమాన్యం పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..