International Women’s Day 2021: అరుదైన రికార్డు సృష్టించిన మహిళలు.. ఆకాశంలో 16 వేల కిలోమీటర్లు పయనం..

International Women’s Day 2021:  ప్రపంచంలోనే సుదూర ప్రయాణం చేసి రికార్డు సృష్టించారు నలుగురు మహిళా పైలట్‏లు. ఎయిర్ ఇండియాకు చెందిన నలుగురు మహిళా పైలట్ లు

International Women’s Day 2021: అరుదైన రికార్డు సృష్టించిన మహిళలు.. ఆకాశంలో 16 వేల కిలోమీటర్లు పయనం..

Updated on: Mar 06, 2021 | 10:14 PM

International Women’s Day 2021:  ప్రపంచంలోనే సుదూర ప్రయాణం చేసి రికార్డు సృష్టించారు నలుగురు మహిళా పైలట్‏లు. ఎయిర్ ఇండియాకు చెందిన నలుగురు మహిళా పైలట్ లు అత్యంత సుదీర్ఘ ప్రయాణం చేసి విజయవంతంగా తిరిగొచ్చారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్ కో నుంచి ఉత్తర ధ్రువం మీదుగా బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి 16 వేల కిలోమీటర్లు దూరం ప్రయాణం చేసి మహిళా పైలట్ లు తమ సత్తాను నిరూపించుకున్నారు.

మహిళలు ఏ రంగంలోనూ ఎవరికీ తీసిపోరు అని సత్తా చాటే విధంగా అత్యంత సాహసోపేతంగా మహిళలు ఈ సుదూర ప్రయాణాన్నిపూర్తి చేశారు. ఇక ఈ నలుగురు పైలట్ ల బృందంలో తెలుగమ్మాయి కూడా ఉన్నారు . నలుగురు మహిళా పైలెట్ లు సిబ్బందితో సుదీర్ఘ ప్రయాణం చేసిన భారీ విమానం జనవరి 11 2021 నాడు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. మహిళా పైలట్ లు నడిపిన ఎయిరిండియా విమానానికి ప్రధాన పైలెట్ గా కెప్టెన్ జోయా అగర్వాల్ అసిస్టెంట్ పైలెట్ గా తెలుగు అమ్మాయి కెప్టెన్ పాప గారి తన్మయి, కెప్టెన్ శివాని మనహాస్, కెప్టెన్ సోనావారే వ్యవహరించారు. విరామం లేకుండా 16 వేల కిలోమీటర్లు ప్రయాణించి మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచారు. అంతేకాదు ప్రపంచంలోనే రెండో పొడవాటి బోయింగ్ విమానాన్ని నడిపి తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించడమే కాకుండా అపార సాంకేతిక పరిజ్ఞానం, అనుభవం ఉన్నవారు మాత్రమే దక్కించుకునే ఈ అవకాశాన్ని మహిళా పైలట్ లు సద్వినియోగం చేసుకున్నారు. తామేంటో ప్రూవ్ చేశారు ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించటం వల్ల పది టన్నుల ఇంధనాన్ని ఆదా చేయగలిగారు. అత్యంత క్లిష్టమైన ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణం చేసి మహిళా పైలెట్లు తామేంటో నిరూపించుకున్నారని , ప్రపంచం నలు దిక్కులకు మహిళా శక్తిని చాటి చెప్పారు. ఎయిర్ ఇండియా విమానానికి చెందిన మహిళా శక్తి మరోసారి తామెంటో నిరుపించుకున్నారు.

Also Read:

International Women’s Day 2021: అందమైన అతివలకు… అదిరిపోయే డ్రెస్సింగ్ ఐడియాస్.. ఉమెన్స్‌ డే సందర్బంగా ఓ లుక్కేయండి!

సండే స్పెషల్.. పుదీనా చికెన్ బజ్జీలు.. కాంబినేషన్ అదిరిపోలా.. ఎలా చేయాలో తెలుసా !