Villagers Strange Verdict: ఏంటి? దారుణం! హైటెక్ యుగంలో ఏంటి మూఢవిశ్వాసం. వారి అనారోగ్యానికి వీరే కారణం అన్నది గ్రామస్తుల అంచనా. పంచాయితీపెట్టారు. ఫైన్ విధించారు. అంతే ఆ ముగ్గురిలో ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడీ సమస్య పెద్ద వివాదంగా మారింది.
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం వైదోనివంపులో మహిళ మృతికి కారణమయ్యారని ముగ్గురు వ్యక్తులపై గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు. గ్రామస్తులు కొంత కాలంగా అనారోగ్యానికి గురువుతున్నారు. నెల రోజుల క్రితం చంద్రమ్మ చనిపోయింది. దీనికి చేతబడే కారణమన్నది గ్రామస్తుల అంచనా. మంత్రాలు చేస్తున్నారనీ గ్రామానికి చెందిన శేఖర్, అంజయ్య, అంజయ్య కోడలు నాగమ్మ, సైదులును గ్రామపంచాయతీ కార్యాలయానికి పిలిచారు. 200 మంది గ్రామస్తుల సమక్షంలో గ్రామపెద్దలు పంచాయితీ పెట్టారు. ఒక్కొక్కరికి 8 లక్షల రూపాయల జరిమానా విధించారు. దీంతో ఆందోళన చెందిన అంజయ్య ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కలకలం రేపుతోంది.
తన తండ్రికి మంత్రాలు రావు, మంత్రాల పేరుతో అవమానించడంతో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని అంజయ్య కొడుకు వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రాణభయంతో తాము ఇంటి నుంచి బయటకు రావడం లేదని చెబుతున్నాడు.
Read Also… Telangana: గుడ్ న్యూస్.. తెలంగాణాలోని అన్ని ఆసుపత్రిలో త్వరలో ఆ వైద్య సేవలు..