India Post Payment Bank APP: ఇండియన్ పోస్టల్ రోజుకో కొత్త పథకంతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. గతంలో కేవలం లెటర్స్ పంపిణీకి మాత్రమే పరిమితమైన పోస్టాఫీస్ ఇప్పుడు బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది.
మరీ ముఖ్యంగా రకరకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతూ పోస్టాఫీసులో ఖాతా తెరిచే వారి సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలో తాజాగా ఇండియన్ పోస్టల్ సాంకేతికతను ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగానే ఓ కొత్త యాప్ తీసుకొచ్చింది. ఐపీపీబీ మొబైల్ యాప్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ యాప్ ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను తమ ఖాతాదారులకు అందిస్తోంది. పోస్టాఫీసులో ఖాతా ఉన్నవారు ఇకపై మొబైల్ ద్వారానే బ్యాలెన్స్ చెకింగ్, డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసుకోవడంతో పాటు ఇతర లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా పోస్టాఫీస్‌లో ఖాతా తెరవడానికి కూడా ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్‌లోనే చేసుకోవచ్చు. పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతా తెరవాలంటే ఖాతాదారునికి 18 ఏళ్లు నిండివుండాలి. అలాగే భారతీయ పౌరుడై ఉండాలి. ఇందుకోసం ముందుగా ‘ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని. తర్వాత ఓపెన్ అకౌంట్‌పై క్లిక్ చేసి, అవసరమైన వివరాలు అందించాల్సి ఉంటుంది. అనంతరం మొబైల్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా ఖాతాను ఎంటర్ చేసి.. చిరునామా, నామినీ వంటి వివరాలు అందజేయాలి అంతే మీ పోస్టల్ ఖాతా సిద్దమైనట్లే.
Also Read: మన అత్యంత ప్రియనేస్తం రేడియో! మన ఆనంద విషాదాల్లో పాలు పంచుకునే చుట్టం రేడియో!