Vastu Tips: మనుషుల ఆలోచనలపై రంగుల ప్రభావం.. ఏ కలర్‌ ఏం చెబుతోంది.

కలర్స్‌ మనిషి భావోద్వేగాలను కంట్రోల్‌ చేస్తాయని మానసిక నిపుణులు చెబుతుంటారు. అంతేనా కలర్స్‌ మనిషి ఆలోచనలు, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అంటుంటారు. ఇక వాస్తు శాస్త్రంలోనూ రంగులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. వాస్తు శాస్త్రం ఆధారంగా ఇంట్లో రంగులు వేసుకోవాలని వాస్తు సూచిస్తుంది...

Vastu Tips: మనుషుల ఆలోచనలపై రంగుల ప్రభావం.. ఏ కలర్‌ ఏం చెబుతోంది.
Colours

Updated on: Jan 07, 2024 | 10:11 AM

రంగులకు మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కలర్స్‌ మనిషి భావోద్వేగాలను కంట్రోల్‌ చేస్తాయని మానసిక నిపుణులు చెబుతుంటారు. అంతేనా కలర్స్‌ మనిషి ఆలోచనలు, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అంటుంటారు. ఇక వాస్తు శాస్త్రంలోనూ రంగులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. వాస్తు శాస్త్రం ఆధారంగా ఇంట్లో రంగులు వేసుకోవాలని వాస్తు సూచిస్తుంది. ఇంతకీ మానసిక నిపుణుల ప్రకారం ఏ రంగు, దేనిని సూచిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

పసుపు: పసుపు రంగు ఆనందం, జ్ఞానానికి చిహ్నం. ఇది మేధస్సు, ఆశావాదాన్ని సూచిస్తుంది. ఆలోచనలను మెరుగుపరచడానికి, ఏకాగ్రతను పెంచడానికి ఈ రంగును స్టడీ రూమ్స్‌లో వేసుకోవచ్చు. అలాగే వంట గదిలో సంతోషకరమై వాతావరణాన్ని పెంచడానికి కూడా పసుపు రంగును ఉయోగిస్తారు.

ఆరెంజ్: ఇక ఆరెంజ్‌ కలర్‌ ఆనందం, సృజనాత్మకత, ఉత్సాహానికి సింబల్‌గా ఉంటుంది. ఈ రంగును ఎ్కువగా హాల్‌ లేదా, డైనింగ్‌ రూమ్‌ వంటి ప్రదేశాల్లో వేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబతోంది.

పర్పుల్: ఊదా రంగు మేధస్సు, ఆధ్యాత్మికత, విలాసానికి చిహ్నం. ఈ రంగు అంతర్గత ప్రశాంతతను ప్రోత్సహిస్తుంది. ధ్యాన మందిరాలు వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఈ రంగును ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

నీలం: నీలం రంగు స్థిరత్వం, సంపద, ప్రశాంతతకు చిహ్నం. ఈ రంగును ఇంట్లో ఉండే వారికి విశ్రాంతి భావన కలిగిస్తుంది. ధ్యానం లేదా ప్రార్థనా స్థలాలలో శాంతిని ప్రోత్సహించడానికి నీలం రంగును ఉపయోగించండి. బెడ్‌రూమ్‌లలో ప్రశాంత వాతావరణాన్ని సృష్టించడానికి కూడా ఈ రంగును ఉపయోగించవచ్చు.

ఎరుపు: రెడ్‌ కలర్‌ బలం, ఉత్సాహం, తేజానికి సింబల్‌గా చెబుతుంటారు. ప్రేరణ, శక్తికి రెడ్‌ కలర్‌ ముడిపడి ఉంటుంది. ఈ రంగును భోజనాలు గది లేదా జనాలు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాల్లో ఉపయోగించాలి. ఈ కలర్‌ ఆహారంపై ఆసక్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

పింక్‌: పింక్‌ కలర్‌ స్వచ్ఛత, ఆప్యాయతను సూచిస్తుంది. మనుసును ప్రశాంతంగా ఉంచుతుంది. అందుకే ఈ రంగును ఎక్కువగా బెడ్‌ రూమ్‌లో పింక్‌ కలర్‌ వేసుకోవడం వల్ల జంటల మధ్య బంధం బలపడుతుంది.

ఆకుపచ్చ: గ్రీన్‌ కలర్‌ అనేది సామరస్యం, పురోగతికి చిహ్నంగా ఉంటుంది. ముఖ్యంగా లివింగ్‌ రూమ్స్‌, కుటుంబ సభ్యులు ఎక్కువగా కలుసుకునే ప్రదేశాల్లో గ్రీన్‌ కలర్‌ వేసుకుంటే కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని, ఏకత్వాన్ని పెంపొందిస్తుంది.

తెలుపు రంగు: వైట్‌ కలర్‌ ప్రశాంతత, స్వచ్ఛతను సూచిస్తుంది. సానుకూల భావాలను పెంపొందించడంలో వైట్‌ కలర్‌ది కీలక పాత్ర. వైట్‌ కలర్‌ను ఎక్కువగా బెడ్‌ రూమ్‌లో వేసుకోవాలని చెబుతుంటారు. ఇది మంచి నిద్రకు ఉపయోగపడడమే కాకుండా ప్రశాంతతను ఇస్తుంది. దేవుడి గదిలోనూ వైట్ కలర్‌ వేసుకోవాలని చెబుతుంటారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..