Jay Chaudhry: కుగ్రామంలో పుట్టిన రైతు బిడ్డ.. నేడు రోజుకు 153 కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడు

|

Oct 02, 2021 | 9:25 PM

 అది చాలా కుగ్రామం. దేశం ముందుగా వెళ్తోన్న సమయంలో కూడా.. మౌళిక సదుపాయల విషయంలో ఆ గ్రామం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.

Jay Chaudhry: కుగ్రామంలో పుట్టిన రైతు బిడ్డ.. నేడు రోజుకు 153 కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడు
Jay Chaudhry
Follow us on

అది చాలా కుగ్రామం. దేశం ముందుకు వెళ్తోన్న సమయంలో కూడా.. మౌళిక సదుపాయల విషయంలో ఆ గ్రామం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. విద్యుత్, తాగు నీరు వంటివి కూడా ఆ ఊరిలో చాలా పెద్ద సమస్యలుగా ఉండేవి. హలం పొట్టి పొలం దున్నడం తప్ప అక్కడి వారికి మరో పని తెలీదు. అలాంటి గ్రామానికి చెందిన వ్యక్తి ఇప్పుడు ఇండియాలో అంత్యంత ధనవంతుల జాబితాలో 10వ స్థానాన్ని దక్కించుకున్నాడు.  రోజుకు రూ.153కోట్లను సంపాదిస్తూ.. రికార్డు క్రియేట్ చేస్తున్నాడు.  రైతు కుటుంబంలో జన్మించి.. సంచలన వ్యక్తిగా మారిన అతడి పేరు జై చౌదరి. ‘ఐఐఎఫ్‌ఎల్ వెల్త్-హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021’ తాజా రిపోర్ట్ వచ్చేసింది. ఈ నివేదిక ప్రకారం.. దేశంలో కనీసం రూ.1,000 కోట్లకు పైగా ఆస్తి కలిగిన వారి సంఖ్య ఫస్ట్ టైమ్ 1,000 మార్క్ దాటింది. గత ఏడాదితో పోల్చితే, వీరి సంఖ్య 179 పెరిగి 1,007కు చేరుకుంది.

కాగా.. ఐఐఎఫ్ఎల్ వెల్త్-హురున్ ఇండియా రిచ్ లిస్ట్ జాబితాలో జై చౌదరి టెన్త్ ప్లేసులో ఉన్నారు. ప్రజంట్ హ్యాకర్లు ఏ రేంజ్‌లో రెచ్చిపోతున్నారో తెలిసిందే. దీంతో సైబర్ సెక్యురిటీకి  ఓ రేంజ్‌లో డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో జై చౌదరికి చెందిన జెడ్‌స్కేలర్‌  కంపెనీ భారీగా ప్రాఫిట్స్ అందుకుంది. దీంతో గత ఏడాది కాలంలో ఆయన సంపద ఏకంగా 85శాతం మేర పెరిగింది. ఈ క్రమంలో జై చౌదరి రూ.1,21,600 కోట్ల సంపదను సృష్టించారు.

జై చౌదరి నేపథ్యం ఇదే

హిమాచల్ ప్రదేశ్-పంజాబ్ రాష్ట్రాల బార్డర్లలో ఉన్న పనోహ్ అనే మారుమూల గ్రామంలోని రైతు కుటుంబంలో జై చౌదరి జన్మించారు. 8వ తరగతి వరకూ ఆయన దీపం వెలుగులతోనే చదువకున్నారు. టెన్త్ క్లాస్ వరకూ కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి తాగి నీటి కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలా కష్టాల మధ్య చదవును కొనసాగిస్తూనే ఐఐటీ వారణాసీలో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి బ్యాచ్‌లర్ డ్రిగ్రీ పట్టా పొందారు. అనంతరం హైయ్యర్ స్టడీస్ కోసం యూఎస్‌లోని ఓ యూనివర్సీటిలో అప్లై చేశారు. ఈ క్రమంలోనే కొందరు సహాయం చేయడం ద్వారా అమెరికా వెళ్లి చదువుపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. స్టడీస్ కంప్లీట్ అయ్యాక.. కొన్ని సంవత్సరాలపాటు ఆయన వివిధ కంపెనీల్లో పని చేశారు. అనంతరం అతని భార్య జ్యోతి చౌదరితో కలిసి సెక్యూర్‌ఐటీ అనే సంస్థను నెలకొల్పారు. ఈ క్రమంలోనే 2007 జెడ్‌స్కేలర్‌ను స్టార్ట్ చేశారు. కాగా.. ఈ కంపెనీలో జై చౌదరికి 42శాతం షేర్ ఉంది.

Also Read: విడాకుల ప్రకటన అనంతరం గుండె నిండా బాధతో సంచలన స్టేటస్ పెట్టిన సమంత

ఆ ఇంట ఒదిగిపోయింది.. కానీ అనూహ్యంగా ఏమైంది..?