వాలెంటైన్స్ డేకు రెండు రోజుల ముందు జరుపుకునేదే హగ్ డే. హగ్ డే యొక్క ప్రాముఖ్యత దాని పేరులో స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజున జంటలు కనీసం ఒక కౌగిలింతనైనా పంచుకోవడం వాలెంటైన్స్ వారంలో భాగంగా వస్తున్న ఆనవాయితీ. కౌగిలింత అనేది, ప్రేమ, స్వచ్చత, భద్రతల భావవ్యక్తీకరణగా ఉంటూ, మీ ప్రేమ ఎంత సురక్షితమైనదోనని మీ భాగస్వామికి అర్థమయ్యేలా చేస్తుంది. నిజానికి కౌగిలించుకోవడం వలన మెదడులోని ఆక్సిటోసిన్ విడుదలను పెంచుతుంది. అంతేకాకుండా ఇది న్యూరోట్రాన్స్మిటర్గా పనిచేస్తూ.. ఇద్ధరి మద్య బంధాలను పెంచడానికి సహయపడుతుంది. ఇవే కాకుండా ముఖ్యంగా కౌగిలింత ఒత్తిడి, ఆందోళనలను కూడా దూరం చేస్తుంది. కౌగిలింత ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. అందుకే స్నేహితులు, సన్నిహితులు, ప్రేమికులు ఈ హాగ్ డేను జరుపుకోవచ్చు.
ఒకరినోకరు హగ్ చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు..
☛ కౌగిలింత వల్ల ఒత్తిడి తగ్గి భరోసా లభిస్తుంది. కంఫర్ట్‌గా ఫీలవడానికి ఉపకరిస్తుంది.
☛ హగ్ వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాస లేమితో సతమతం అవుతున్న వారిలో స్పర్శ వల్ల వ్యాకులత తగ్గుతుంది.
☛ మూడ్ బాగోలేనప్పుడు ఫ్రెండ్ లేదా ఇష్టపడే వ్యక్తి హగ్ చేసుకోవడం వల్ల మీ మూడ్ మారుతుంది.
☛ కౌగిలింత గుండె ఆరోగ్యానికి మంచిది. చేతిలో చేతిని వేసి ఉంచడం, కౌగిలించుకోవడం వల్ల రక్తపోటు, హృదయ స్పందనల రేటు తగ్గుతున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది.
☛ కౌగిలింత వల్ల అనారోగ్యం బారిన పడే ముప్పు కూడా తగ్గుతుంది. ఛాతి భాగంలో కలిగే మృదువైన ఒత్తిడి వల్ల తైమస్ గ్రంథి ఉత్తేజితం అవుతుంది. ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
☛ హగ్గింగ్ వల్ల ఆక్సిటోసిన్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా ఒత్తిడి తగ్గి ఆనందం పెరుగుతుంది. కౌగిలింత హార్మోన్ అని కూడా పిలిచే ఆక్సిటోసిన్ ప్రభావం మహిళలపై ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు.
మీ ప్రేమకు ప్రతిరూపంగా ఈ కోటేషన్లను మీ ప్రియమైనవారికి తెలపండి..
♡ నీ మీద నాకున్న ప్రేమను తెలపడానికి మాటలను చెప్పలేను.. కానీ నా కౌగిలింతతో మరిన్ని భావాలను తెలుపగలను. హ్యాపీ హగ్ డే!
♡ నా మనసులో ఎంత ఆందోళన ఉన్నా.. నీన్ను చూడగానే వాటన్నింటిని మర్చిపోతాను.. నిన్ను ఆత్మీయంగా పట్టుకున్నప్పుడు నేను సంతోషంగా ఉన్నట్లుగా భావిస్తాను. హ్యాపీ హగ్ డే.
♡ ఎంత కోపం ఉన్నా.. ఎంత ప్రేమ ఉన్నా.. మనకు బాగా ఇష్టమైన వాళ్ళ మీదనే చూపించగలం… నాకు నువ్వంటేనే ప్రాణం… హ్యాపీ హగ్ డే.
♡ నీతో ప్రతిరోజు గొడవ పడతాను.. కానీ నీతో మాట్లాడకుండా ఉండలేను. ఎందుకంటే నువ్వంటే నాకు అంత ప్రేమ. హ్యాపీ హగ్ డే.
♡ నీకంటూ వేరే ప్రపంచం ఉందేమో.. కానీ నా ప్రపంచం నువ్వే.. నా ప్రతి ఆలోచనలో నువ్వే ఉంటావ్.. హ్యాపీ హగ్ డే.
♡ నాలో ఉన్న సంతోషాన్ని మాటల్లో చెప్పలేను.. నా మనసులో దాగిన భావాలను నీతో చెప్పాలనుకుంటున్నాను.. కానీ చెప్పలేను.. నా ఆత్మీయ కౌగిలింతలోనే అర్థమవుతుందనుకుంటాను.. హ్యాపీ హగ్ డే.
♡ చెప్పలేని… అర్థం కానీ భాదను అధిగమించాలనుకుంటే.. ఒక్కసారి అమ్మను గట్టిగా హత్తుకుంటే ఆ భాద మొత్తం ఆవిరైపోతుంది.. హ్యాపీ హగ్ డే.
Also Read:
Chocolate Day: ఈరోజు తియ్యటి వేడుక చేసుకుందాం.. ఈ చాక్లెట్స్‌తో మనసులోని మాటలను వ్యక్తపరచండిలా..