Driving License: అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని అనుకుంటున్నారా.. వెంటనే ఇలా చేయండి

మోటారు వాహనాన్ని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. అది లేకుండా మోటారు వాహనం నడపడానికి ఎవరికీ అనుమతి లేదు.

Driving License: అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని అనుకుంటున్నారా.. వెంటనే ఇలా చేయండి
Driving License

Updated on: Jun 30, 2023 | 8:05 PM

International Driving License: వాహనం నడపాలంటే మనకు ముందుగా కావాల్సినది డ్రైవింగ్ లైసెన్స్.. ఇది లేకుండా మనం వాహనం తీసుకుని రోడ్డు మీదకు వస్తే ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటారు. ఫైన్ వేస్తారు. కానీ, మీరు విదేశాలకు వెళ్లాల్సివచ్చినప్పుడు అక్కడ డ్రైవింగ్ చేయాల్సి వస్తే మన దేశంలో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్స్ అక్కడ పనిచేయదు.  అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ విడిగా తీసుకోవలి. అలాకాకుండా మనం ఇక్కడ అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్  తీసుకోవచ్చు. దానిని మీరు సంబంధిత ఆర్టీవో (ప్రాంతీయ రవాణా కార్యాలయం) నుంచి తీసుకోవచ్చు. దీన్ని పూర్తి చేయడానికి రెండు ప్రధాన షరతులు ఉన్నాయి. ఇందులో మొదటిది.. మన దేశంలో ఇప్పటికే ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలి. ఇలా పొందినవారికి మాత్రమే అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ ఇస్తారు. రెండవది.. తీసుకోవాలని అనుకున్న వ్యక్తి భారతీయుడై ఉండాలి. ఇందుకోసం సంబంధిత ఆర్టీఓలో దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ మీరు ఫారమ్ 4A నింపి సమర్పించాలి. దీనితో పాటు, మీరు ఒక దేశానికి వెళ్తున్నారని, మీరు అక్కడ ఎన్ని రోజులు ఉండబోతున్నారని కూడా మీరు RTORకి తెలియజేయాల్సి ఉంటుంది.

ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఈ పత్రాలు సమర్పించండి..

  • దరఖాస్తుదారు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. దాని కాపీని ఆర్టీఓకు సమర్పించాల్సి ఉంటుంది.
  •  పాస్‌పోర్ట్
  • వీసా
  • విమాన టిక్కెట్ కాపీ
  • పైన చెప్పిన అన్ని పత్రాలను జత చేయండి.

ప్రత్యేకత ఏంటంటే.. అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ కోసం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.  ఫారమ్ 4A సమర్పణతో పాటు.. అంతర్జాతీయ డ్రైవింగ్ అనుమతి కోసం నిర్ణీత ఫీజు చెల్లించాలి. ప్రక్రియలు పూర్తయిన తర్వాత.. అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ దాదాపు 5 పని దినాలలో మీ ఇంటి చిరునామాకు పోస్ట్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ పంపిణీ చేయబడుతుంది.

మరిన్ని హ్యూమన్ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం