మీ ఆధార్ కార్డ్ పోయిందా? నెంబర్ గుర్తుకు లేదా? పోనీ, ఆధార్ ఎన్‌రోల్ నెంబర్ కూడా లేదా? ప్రభుత్వ పథకాలు, ఇతర పనులకు కార్డు లేదని చింతిస్తున్నారా? మరేం పర్వాలేదు. అస్సలు టెన్షనే వద్దు. పోయిన కార్డును సులువుగా తీసుకునే మార్గం ఉంది. వాస్తవానికి భారతదేశ పౌరులకు ఆధార్ కార్డ్ కీలకమైన డాక్యూమెంట్. బ్యాంకు ఖాతా, పాన్‌కార్డు, రేషన్‌కార్డు తదితర వాటితో అనుసంధానం చేయడం తప్పనిసరి చేశారు. ఆధార్ కార్డు లేకపోతే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోలేరు. ఆధార్ కార్డ్ లేకుండా, ముఖ్యమైన పని ఏదీ జరుగదు.
ఇలాంటి పరిస్థితిలో ఆధార్ కార్డ్ పోతే? దాని నంబర్ కూడా గుర్తులేకపోతే? సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, దీనికి గురించి ఇక చింతించాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డ్ పోయినా? నెంబర్ మర్చిపోయినా? ఈజీగా మీ ఆధార్ కార్డును తిరిగి పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మీ ఆధార్ కార్డ్ పోయినట్లయితే, UIDAI దాన్ని మళ్లీ పొందే సదుపాయాన్ని కల్పిస్తుంది. ఇందుకోసం సర్వీస్ పోర్టల్‌కు వెళ్లి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. ఇక్కడ నుండి ఆధార్ నంబర్, ఆధార్ రెండవ కాపీని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆధార్ కార్డును క్రియేట్ చేసే సమయంలో సంబంధిత వ్యక్తి మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి ని కూడా యాడ్ చేస్తారు. ఒక వేళ మీ ఆధార్ కార్డ్ పోయినట్లయితే.. ఆధార్ కార్డ్‌తో నమోదు చేయబడిన మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడిని ఉపయోగిస్తే, పోయిన ఆధార్ నంబర్‌ను తిరిగి పొందవచ్చు. ఇందుకోసం కొంత ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
1. ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
2. ఇప్పుడు మీరు ఆధార్ నంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ నంబర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
3. ఆ తర్వాత, మీ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ID గురించిన సమాచారాన్ని ఇవ్వాలి.
4. ఇప్పుడు Send OTPపై క్లిక్ చేసి, మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి.
5. లాగిన్ అయిన తర్వాత, మీ ఆధార్ నంబర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది.
6. ఇప్పుడు మీరు ఆధార్ నంబర్ సహాయంతో ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..