Cleaning Tips: మీ ఇంట్లోని బాత్రూం జిడ్డుగా.. మురికా ఉందా.. ఇలా చేస్తే మెరిసిపోతాయి.. ఏం చేయాలంటే..

మీ బాత్రూంలో టైల్స్ మురికిగా మారినట్లయితే ఎలా క్లాన్ చేసుకోవాలో మనం అలాంటి కొన్ని చిట్కాలను తెలుసకుందాం. వీటిని జస్ట్ ఫాలో అయితే మీ ఇంట్లోని బాత్రూమ్ టైల్స్‌ను సులభంగా మెరుస్తాయి.

Cleaning Tips: మీ ఇంట్లోని బాత్రూం జిడ్డుగా.. మురికా ఉందా.. ఇలా చేస్తే మెరిసిపోతాయి.. ఏం చేయాలంటే..
Bathroom Tiles Stain

Updated on: Sep 16, 2022 | 2:01 PM

ఇంట్లో శుభ్రత చాలా ముఖ్యం. ఇంట్లో ప్రతిరోజూ చీపురు ఊడవటం..మాబ్‌తో శుభ్రం చేయడం చేస్తుంటాం. కానీ ప్రతిరోజూ శుభ్రం చేయలేని ప్రదేశాలు చాలా ఉన్నాయి. వీటిలో ఒకటి బాత్రూంలో టైల్స్. రోజూ బాత్ రూమ్ లో స్నానం చేస్తుంటాం.. దీంతో అక్కడ అమర్చిన టైల్స్ పై నీళ్లు, సబ్బు చేరడంతో మురికిగా మారిపోతాయి. దీని కారణంగా మురికిగా.. అసహ్యంగా కనిపిస్తారు. వాటిని శుభ్రం చేయడం పెద్ద పని. ఈ టైల్స్ తెలుపు రంగులో ఉంటే.. అది మనకు పెద్ద సవాలుగా మారుతుంది. ఈ రోజు మనం కొన్ని చిట్కాలతో బాత్రూం వేగంగా క్లీన్ అవడమే కాదు.. మెరుస్తుంటాయి. 

వంట సోడా

బాత్రూమ్ టైల్స్ శుభ్రం చేయడానికి మీరు బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో బేకింగ్ సోడా తీసుకుని అందులో కొన్ని చుక్కల నీరు వేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్పాంజ్ సహాయంతో టైల్స్ పై అప్లై చేసి రుద్దండి. దీని తరువాత టైల్స్‌ను గోరువెచ్చని నీటితో కడగండి. దానిపై ఉండే మురికి వేగంగా పోతుంది.

వెనిగర్

బాత్రూమ్ టైల్స్ నుంచి మరకలను తొలగించడానికి మీరు వెనిగర్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఒక బకెట్‌లో గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో వెనిగర్ కలపాలి. ఇప్పుడు ఈ ద్రావణంలో ఒక గుడ్డను ముంచి బాత్రూమ్ టైల్స్ శుభ్రం చేయండి. టైల్స్ చాలా మురికిగా ఉంటే మీరు స్పాంజిని కూడా ఉపయోగించవచ్చు.

ఉప్పు

వంటగదిలో ఆహార రుచిని పెంచే ఉప్పు, టైల్స్ శుభ్రం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. దీని కోసం, శుభ్రమైన గుడ్డపై కొంచెం ఉప్పు తీసుకొని, ఆపై దానితో బాత్రూమ్ టైల్స్ శుభ్రం చేయండి. రాత్రంతా ఇలాగే వదిలేసి, మరుసటి రోజు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం