mAadhaar App: ఆధార్ కార్డ్.. ఇప్పుడీ కార్డు భారతదేశానికి చెందిన ప్రతీ పౌరుడికి ఎంతో కీలకంగా మారింది. దేశంలోని ప్రతి పౌరుడికి సంబంధించిన సమస్త సమాచారం ఒక్క ఆధార్ కార్డులోనే నిక్షిప్తం అయ్యి ఉంది. అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) జారీ చేసిన 12 అంకెల సంఖ్య గల ప్రత్యేక గుర్తింపు కార్డే.. ఆధార్ కార్డు. ప్రస్తుత కాలంలో ప్రతీ భారతీయుడికి ఇది తప్పనిసరి అయ్యింది. ఇంతటి కీలకమైన ఆధార్‌ను కొందరు కేటుగాళ్లు దుర్వినియోగపరుస్తున్నారు. నకిలీ ఆధార్ కార్డులు సమర్పిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఈ కేటుగాళ్ల ఆటలు కట్టించేందుకు తాజాగా యూఐడీఏఐ కీలక ప్రకటన విడుదల చేసింది. ఒక్క క్లిక్‌తో అది నకిలీ ఆధార్ కార్డా? నిజమైన ఆధార్ కార్డా? అనేది తేల్చేందుకు సరికొత్త మొబైల్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
‘ఎం ఆధార్’ మొబైల్ యాప్ ఎప్పటి నుంచో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆ యాప్‌లో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఆధార్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా అది నకిలీదా? నిజమైనదా? ఇట్టే తేల్చే విధంగా ఫీచర్‌కు రూపకల్పన చేసింది. ఆ ఫీచర్‌కు సంబంధించి వివరాలు వెల్లడిస్తూ ఇటీవల యూఐడీఏఐ ఓ ట్వీట్ చేసింది. క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఎలా చేయాలి? దాని వల్ల కలిగే ఉపయోగాలేంటి? తదితర అంశాలను పేర్కొంది. మరి ఆ క్యూఆర్ కోడ్ ఏంటి? ఎలా స్కాన్ చేయాలి..? నకిలీ ఆధార్ కార్డులను ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం చూద్దం.
‘ఎం ఆధార్’ యాప్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఎవరైనా మీకు తప్పుడు ఆధార్ కార్డు ఇచ్చినట్లయితే ఇట్టే పసిగట్ట వచ్చు. అలా మాయగాళ్ల మోసాల బారిన పడకుండా సురిక్షితంగా ఉండవచ్చు. అదెలాగంటే..
1. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న ‘ఎం ఆధార్’ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
2. యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత.. రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్ కూడా సెట్ చేసుకోవాలి.
3. యాప్ ఓపెన్ చేశాక క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఆప్షన్ ఉంటుంది.
4. యూఐడీఏఐ ద్వారా జారీ చేయబడిన ప్రతీ ఆధార్ కార్డుపై క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ఉంటుంది.
5. ఆధార్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను ఎం ఆధార్ యాప్‌లో ఉన్న స్కానర్‌తో స్కాన్ చేయాలి.
6. ఆ వెంటనే ‘ఎం ఆధార్’ యాప్‌తో స్కాన్ చేసిన కార్డు దారుని పూర్తి వివరాలు కనిపిస్తాయి.
7. అలా కనిపించిన వివరాలు, కార్డుపై ఉన్న వివరాలు, వ్యక్తిని సరిపోల్చి చూస్తే.. ఆ ఆధార్ కార్డు నకిలీదా? నిజమైనదా? తేలిపోతుంది.
యూఐడీఏఐ వెబ్‌సైట్ ద్వారా కూడా ఆధార్‌ను ధృవీకరించవచ్చు. అదేలాగంటే..
1. ముందుగా యుఐడీఏఐ వెబ్‌సైట్‌ని క్లిక్ చేయాలి.
2. సర్వీసెస్ విభాగంలో ఉన్న ‘ఆధార్ నంబర్ వేరిఫికేషన్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
3. 12 అంకెల ఆధార్ నంబర్, క్యాప్చా ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
4. ఎంటర్ చేసిన ఆధార్ వివరాలు సరైనవైతే, అది ధృవీకరించబడుతుంది.
5. ఆధార్‌తో అనుసంధానించబడిన మొబైల్ నెంబర్, పూర్తి చిరునామా కనిపిస్తాయి.
ఇదిలాఉండగా, అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) జారీ చేసిన ఆధార్ కార్డుపై 12 అంకెల సంఖ్యతో పాటు, ముందు భాగంలో చిన్న క్యూఆర్ కోడ్ ఉంటుంది. యూఏడీఏఐ డిజిటల్ సంతకంతో చేయబడిన ఈ క్యూఆర్ కోడ్ సంబంధిత వ్యక్తుల సమాచారం సురక్షితంగా ఉంచడానికి దోహదపడుతుంది. అలాగే, ఎవరైనా మోసాలకు పల్పడితే క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు.
UIDAI TWEET:
You can verify any presented Aadhaar by Scanning the QR Code on it using your #mAadhaar app.
Read more about how to verify any presented Aadhaar here: https://t.co/inXqLFqKyz pic.twitter.com/sexDeNTGNe— Aadhaar (@UIDAI) February 18, 2021
Also read:
Uttar Pradesh Accident : పెళ్లి కోసం సంతోషంగా ఊరేగింపుగా వెళ్తోన్న వధువు.. అంతలోనే విషాద ఘటన
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. ఆ అధికారం ఎస్ఈసీకి లేదన్న ధర్మాసనం