మీ పిల్లలకు ఆధార్ కార్డ్ ఉందా ? నెలల చిన్నారి నుంచి 5 ఏళ్ళ పిల్లల వరకు ఆధార్ కోసం ఎలా అప్లై చేయాలో తెలుసా..

|

May 02, 2021 | 3:10 PM

Aadhaar Card: ఆధార్ కార్డు.. ఇప్పుడు ప్రతి ఒక్కదానికి అవసరం. భారతీయ పౌరుడిగా గుర్తించబడాలంటే ఆధార్ ఉండాల్సిందే. అలాగే రేషన్ సరుకుల

మీ పిల్లలకు ఆధార్ కార్డ్ ఉందా ? నెలల చిన్నారి నుంచి 5 ఏళ్ళ పిల్లల వరకు ఆధార్ కోసం ఎలా అప్లై చేయాలో తెలుసా..
Aadhaar Card
Follow us on

Aadhaar Card: ఆధార్ కార్డు.. ఇప్పుడు ప్రతి ఒక్కదానికి అవసరం. భారతీయ పౌరుడిగా గుర్తించబడాలంటే ఆధార్ ఉండాల్సిందే. అలాగే రేషన్ సరుకుల నుంచి ఉన్నత విద్య వరకు ప్రతి దానికి ఆధార్ అనుసంధానం చేయాల్సిందే. ఇక ఇప్పటికే పలు ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేశాయి. ఇక ఆధార్ లేకపోతే వారికి ఎదురయ్యే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఇక నెలల చిన్నారి నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఆధార్ ఉండాలి.. అందుకే యూఐడీఏఐ చిన్న పిల్లలకు కూడా ఆధార్ కార్డును అందిస్తోంది. పుట్టిన పిల్లలకు కూడా ఆధార్ కార్డు తీసుకోవచ్చు. చాలా హాస్పిటల్స్.. బర్త్ సర్టిఫికెట్‌తోపాటే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ రశీదులను కూడా అందిస్తున్నాయి.

అయితే పిల్లల బర్త్ సర్టిఫికేట్ మరియు తల్లిదండ్రులలో ఒకరి గుర్తింపు కార్డు. నవజాత శిశువుకు కావాల్సిన ఆధార్ కోసం వారు ఎలాంటి ఫింగర్ ఫ్రింట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బయోమెట్రిక్ డేటా అనేది 5 సంవత్సరాల పిల్లల నుంచి మాత్రమే తీసుకోవడానికి వీలుంటుంది.ఇక నెలల చిన్నారి నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు ఆధార్ కార్డు్ కోసం అప్లై చేయడానికి వారి తల్లిదండ్రులలో ఒకరిది ఆధార్ కార్డు మరియు గుర్తింపు కార్డు అవసరం ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలి..

** ముందుగా UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లి ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ కోసం లింక్ పై క్లిక్ చేయాలి.
** అనంతరం అప్లై ఫాం పై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పిల్లల పేరు, మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి.
** ఆ తర్వాత మీకు సమీపంలోని ఆధార్ కార్డు సెంటర్‏కు అపాయింట్ మెంట్ లభిస్తుంది.
** అవసరమైన సర్టిఫికేట్స్ తీసుకొని అపాయింట్ మెంట్ ఉన్న రోజు.. టైమింగ్ ప్రకారం ఆధార్ సెంటర్‏కు వెళ్ళి ఆధార్ నమోదు చేసుకోవాలి.

Also Read: PF ఖాతాదారులకు అలర్ట్.. ఉద్యోగం మారారా ? అయితే వెంటనే ఈ పని చేయండి.. లేదంటే…

PM Kisan: కరోనా కాలంలో రైతులకు గుడ్‏న్యూస్.. వారి ఖాతాల్లోకి ఒకేసారి రూ.7,500… ఎప్పుడంటే..