Shivaji Maharaj: ఛత్రపతి శివాజీ ఖడ్గం జగదాంబ భారత్‌కు వచ్చేస్తోందా? అసలు ఆ ఖడ్గం ఇంగ్లాండ్ ఎలా చేరుకుంది?

|

Sep 10, 2023 | 10:02 AM

బ్రిటన్ నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు చెందిన ఖగ్డం వాఘ్-నఖ్ తిరిగి వస్తుందనే వార్తల నేపథ్యంలో.. ఆ ప్రత్యేక ఖడ్గం జగదాంబ గురించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. మరాఠా గర్వకారణమైన ఖడ్గం జగదాంబ వచ్చేస్తోందంటూ జనాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది ఎప్పుడు, ఎలా వస్తుందనేది బ్రిటన్, భారత ప్రభుత్వాలు నిర్ణయించాల్సి ఉంటుంది.

Shivaji Maharaj: ఛత్రపతి శివాజీ ఖడ్గం జగదాంబ భారత్‌కు వచ్చేస్తోందా? అసలు ఆ ఖడ్గం ఇంగ్లాండ్ ఎలా చేరుకుంది?
Shivaji Maharaj
Follow us on

బ్రిటన్ నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు చెందిన ఖగ్డం వాఘ్-నఖ్ తిరిగి వస్తుందనే వార్తల నేపథ్యంలో.. ఆ ప్రత్యేక ఖడ్గం జగదాంబ గురించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. మరాఠా గర్వకారణమైన ఖడ్గం జగదాంబ వచ్చేస్తోందంటూ జనాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది ఎప్పుడు, ఎలా వస్తుందనేది బ్రిటన్, భారత ప్రభుత్వాలు నిర్ణయించాల్సి ఉంటుంది. ఇవాళ భారతదేశం, బ్రిటన్ మధ్య సంబంధాలు అన్ని రంగాల్లోనూ అత్యంత మెరుగ్గా ఉన్నాయి. ఈ ప్రత్యేక ఖడ్గాన్ని ఇండియాకు తెప్పించడం పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవని, బ్రిటిష్ ప్రభుత్వం దానిని సులభంగా తిరిగి ఇస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరి భారత్‌కు అందులోనూ ఛత్రపతి శివాజీకి చెందిన ఈ ఖడ్గం అసలు బ్రిటన్‌కు ఎలా చేరింది? ఎవరు ఖడ్గాన్ని అక్కడికి తీసుకెళ్లారు? ఎవరైనా ఈ ఖడ్గాన్ని ఎత్తుకెళ్లారా? లేక నాటి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో స్వాధీనం చేసుకుని, అక్కడికి తరలించారా? వంటి ఇంట్రస్టింగ్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1875 సమయంలో జరిగిందిదీ..

జగదాంబ ఖడ్గం బ్రిటన్ వెళ్ళిన కథ 1875 నాటిది. ఆ సమయంలో, వేల్స్ యువరాజు ఆల్బర్ట్ ఎడ్వర్డ్ VII డిసెంబర్ నెలలో భారతదేశానికి వచ్చారు. ఆయనకు పాత ఆయుధాలంటే ఇష్టమని, అలాంటి విశిష్టమైన ఆయుధాలు ఎక్కడ దొరికినా తన వద్దే ఉంచుకునేవాడని చెబుతున్నారు. అతని రాక గురించి సమాచారం తెలుసుకున్న బ్రిటీష్ అధికారులు.. యువరాజుకు పాత, ప్రత్యేకమైన ఆయుధాలను బహుమతిగా ఇవ్వమని అప్పటి రాజులపై ఒత్తిడి తెచ్చారు. ఆ సమయంలో బ్రిటీష్ వారు చాలా శక్తివంతంగా ఉన్నారు. వారిని ఎదిరించే శక్తి ఏ రాజుకీ లేకపోయింది. చాలా రాజ కుటుంబాలు బ్రిటీష్ వారి కనుసన్నల్లో ఉండేవి. తద్వారా వారు అహంకార పూరితంగా వ్యవహరించేవారు.

బ్రిటీష్ వారు సదరు రాజకుటుంబాల నుంచి భారీగా పన్నులు వసూలు చేసేవారు. బదులుగా వారిని రాజులుగా అంగీకరించేవారు. అయితే, బ్రిటన్ యువరాజు ఎక్కడికి వెళ్లినా.. రాచరిక రాష్ట్రాలు అతనికి తమ పూర్వీకుల పాత ఆయుధాలను బహుమతిగా ఇస్తాయి. ఆ పర్యటనలో ఐదు వందల రాచరిక రాష్ట్రాలు యువరాజుకు ఆయుధాలను సమర్పించాయని చెబుతారు.

బొంబాయికి కనెక్షన్..

బ్రిటన్ యువరాజు తన పర్యటనలో భాగంగా బొంబాయి చేరుకున్నప్పుడు.. అతనికి ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు చెందిన ప్రత్యేక ఖడ్గమైన జగదాంబను సమర్పించారు. ఛత్రపతి శివాజీ వారసుడైన శివాజీ IV ఈ బహుమతిని ఇచ్చాడు. అతను కేవలం తన 11 సంవత్సరాల వయస్సులోనే జగదాంబ ఖడ్గాన్ని, బాకును బహుమతిగా ఇచ్చాడు. ఆ సమయంలో బాంబేలో ప్రిన్స్ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. ఈ కత్తిని ప్రిన్స్ బహుమతిగా స్వీకరించాలని నిర్ణయించుకున్నప్పుడు.. దాని పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఖడ్గంలో పొదిగిన వజ్రాలు, కెంపులు అన్నీ పెచ్చులూడిపోయాయి. ఈ ఖడ్గం మూలకు పడిపోయి శిథిల స్థితిలో ఉండిపోయింది. అయితే, ప్రిన్స్‌కు బహుకరించే ముందు.. కొత్తగా పాలీష్ చేశారు. వజ్రాలు, ఆభరణాలను తిరిగి పొదిగించారు. కొత్త కోశం కూడా తయారు చేశారు. అలా ఆ అపూర్వమైన ఖడ్గాన్ని బ్రిటన్ యువరాజు తనతో పాటు బ్రిటన్ తీసుకెళ్లాడు.

ఆ కత్తి ఇప్పుడు ఎక్కడ ఉంది?

ఈ కత్తి ప్రస్తుతం బ్రిటన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లోని క్వీన్ విక్టోరియా ప్రైవేట్ మ్యూజియంలో ఉంది. ఈ విషయం రెండేళ్ల క్రితం వెల్లడైంది. అప్పటి నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ద్వారా ఆ ఖడ్గాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. శివాజీ మహారాజ్ పులి గోరు(వాఘ్ నఖా) కూడా భారత్‌కు తిరిగి రానుంది. శివాజీ మహారాజ్ అఫ్జల్ ఖాన్‌ను ఈ గోరుతోనే చంపాడు. శివాజీ మహారాజ్‌ని మోసం చేసి చంపమని మొగల్ చక్రవర్తి అఫ్లల్ ఖాన్‌ను పంపిస్తాడు. అయితే, శివాజీ తన వాఘ్ నఖాతో అఫ్జల్ ఖాన్‌ను చంపేస్తాడు.

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న భారత వారసత్వ సంపదను దేశానికి తిరిగి తెప్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అనేక వారసత్వ సంపదను భారత్‌కు తరలించారు. ఈ ప్రయత్నాల ద్వారా ఇప్పటి వరకు 250కి పైగా వస్తువులను తిరిగి ఇండియాకు వచ్చాయి. మరికొన్ని పురాతన వస్తువులు త్వరలోనే ఇండియాకు రానున్నాయి. ఇందులో వాఘ్ నఖ్ కూడా ఉంది.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..