పాము నోటి నుండి విషాన్ని ఎలా తీస్తారు..? దాని ఉపయోగాలు తెలిస్తే మూర్చపోతారు..!

విషపూరిత పాము కాటు ప్రాణాలను హరిస్తుంది. కానీ, అదే పాములను మన దేశంలో భగవంతుడి ప్రతిరూపంగా పూజిస్తారు. అంతేకాదు.. మానవులకు పాము విషం వల్ల అద్భుమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవును పాము విషం నుండి అనేక ప్రాణాంతక వ్యాధులకు ఖరీదైన మందులు తయారు చేస్తారట. అసలు పాము నోటి నుండి విషాన్ని ఎలా తీస్తారు. లక్షలాది మంది ప్రాణాలను కాపాడే యాంటీవీనమ్ ఎలా తయారు చేస్తారు. పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..

పాము నోటి నుండి విషాన్ని ఎలా తీస్తారు..? దాని ఉపయోగాలు తెలిస్తే మూర్చపోతారు..!
Snake Venom

Updated on: Oct 04, 2025 | 12:53 PM

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 54 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. ఒక సంవత్సరంలో దాదాపు 81 వేల నుండి 1.38 లక్షల మంది పాము విషం కారణంగా మరణిస్తున్నారు. పాము విషానికి చికిత్స చేయడానికి యాంటీ-వెనమ్ అవసరం. దీనిని పాము విషం నుండి తయారు చేస్తారు. దీని కోసం ఎవరైనా పాము నోటి నుండి విషాన్ని తీయడం అవసరం. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పనులలో ఒకటి. పాముల నుండి విషాన్ని సేకరించే వ్యక్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇతరులు బతికేలా పాము విషాన్ని సేకరిస్తుంటారు.

పాము విషం వెలికితీత దాదాపు 130 సంవత్సరాలుగా ఉంది. ఈ ప్రక్రియను మొదట ఫ్రెంచ్ వైద్యుడు ఆల్బర్ట్ కాల్మెట్ వియత్నాంలో పాము కాటుకు చికిత్స చేయడానికి అభివృద్ధి చేశారు. విషాన్ని తీయడానికి ముందుగా పామును చేతులతో పట్టుకోవాలి. ఆ తర్వాత పాము ఒక ప్రత్యేక సీసాపై కట్టిన గుడ్డ లేదా రబ్బరు టోపీని కాటువేసేలా చేస్తారు.. ఇది దాని విష గ్రంధుల నుండి విషాన్ని విడుదల చేసి, దాని దంతాల ద్వారా నేరుగా సీసాలోకి విడుస్తుంది.. ఈ విషాన్ని యాంటీవీనమ్ తయారీకి ఉపయోగిస్తారు.

యాంటీ-వెనమ్ ఎలా తయారు చేస్తారు:
పాము విషాన్ని సేకరించిన తర్వాత మలినాలను తొలగించడానికి దానిని ప్రాసెస్ చేస్తారు. ఫ్రీజ్ డ్రైయింగ్ ఉపయోగించి విషాన్ని ద్రవం నుండి పొడిగా మారుస్తారు. పొడి రూపంలో విషం చాలా కాలం పాటు సురక్షితంగా ఉంటుంది. దీనిని తిరిగి హైడ్రేట్ చేసి యాంటీవీనమ్ తయారు చేస్తారు. ఆరు నుండి తొమ్మిది నెలల వ్యవధిలో చిన్న మొత్తంలో గుర్రాలలోకి విషాన్ని ఇంజెక్ట్ చేస్తారు. గుర్రాలు పాము విషానికి వ్యతిరేకంగా ప్రతిరోధకాలను అభివృద్ధి చేస్తాయి. ఇవి వాటి రక్త ప్లాస్మాలో ఉంటాయి. పాము రక్తాన్ని సంగ్రహిస్తారు. ప్లాస్మాను వేరు చేసి ప్రయోగశాలకు పంపుతారు. ప్రయోగశాలలో ప్లాస్మా నుండి యాంటీవీనమ్ తయారు చేయబడుతుంది.

ఇవి కూడా చదవండి

పాము విషం వల్ల ఉపయోగం ఏమిటి?:
పాము విషాన్ని కేవలం విష నిరోధక మందు తయారీకి మాత్రమే కాకుండా వైద్య పరిశోధనలో కూడా ఉపయోగిస్తారు. దీని నుండి తయారైన మందులను అనేక వ్యాధుల చికిత్సకు కూడా ఉపయోగిస్తారు.

వాటిలో ఇవన్నీ ఉన్నాయి.

* క్యాన్సర్

* రక్త రుగ్మతలు

* గుండె జబ్బులు

* నాడీ సంబంధిత వ్యాధి

పాము విషం మానవ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..