ఇండియన్ రైల్వే ద్వారా ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అంతేకాకుండా రైల్వే ప్రయాణికులను రిసీవ్ చేసుకోవడానికి, వారిని డ్రాప్ చేయడానికి కొన్ని లక్షల మంది రైల్వే ప్లాట్ ఫారమ్ మీదికి వస్తుంటారు. అయితే భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, ప్రయాణికులు మాత్రమే చెల్లుబాటు అయ్యే టిక్కెట్‌తో ప్లాట్‌ఫారమ్‌పైకి వెళ్లవచ్చు. కానీ మరి కొందరు వ్యక్తులు కూడా ప్లాట్‌ఫారమ్‌పై తిరుగుతూనే ఉంటారు. అయితే అలాంటి వారిని స్టేషన్ నుంచి అదనపు రద్దీని తగ్గించడానికి.. రైల్వే ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ నియమాన్ని రూపొందించింది. ఎవరైనా తన బంధువును స్టేషన్‌లో దింపడానికి వస్తే.. అలాంటి వారు ప్లాట్‌ఫారమ్‌కు చేరుకోవడానికి రైల్వే ప్లాట్‌ఫారమ్ టికెట్ తీసుకోవాలి.
మీరు ప్రయాణ టిక్కెట్ లేకుండా లేదా రైల్వే ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ లేకుండా ప్లాట్‌ఫారమ్‌పై పట్టుబడితే మీకు జరిమానా విధించవచ్చు. అయితే, ఈ ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ ఎంత సమయం చెల్లుబాటు అవుతుందో తెలుసా..? ఒకసారి ఈ టిక్కెట్‌ను కొనుగోలు చేసిన తర్వాత రోజంతా ప్లాట్‌ఫారమ్‌పై ఉండవచ్చా..?
రైల్వే వెబ్‌సైట్ అందించిన సమాచారం ప్రకారం, రూ. 10 ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌ను తీసుకొని ఏ వ్యక్తి కూడా రోజంతా ప్లాట్‌ఫారమ్‌పై ఉండకూడదు. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ చెల్లుబాటు కేవలం రెండు గంటలు మాత్రమే. అంటే ఒక్కసారి టిక్కెట్టు కొనుగోలు చేస్తే రెండు గంటలు మాత్రమే వినియోగించుకోవచ్చు. రెండు గంటలు దాటిన తర్వాత కూడా మీరు ప్లాట్‌ఫారమ్‌పై ఉండి.. పట్టుబడితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
మీరు ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ కొనడం మరచిపోతే.. రైల్వే టికెట్ చెకింగ్ సిబ్బంది మీకు కనీసం రూ.250 జరిమానా విధించవచ్చు. అంతే కాదు, టిక్కెట్టు లేకుండా ప్లాట్‌ఫారమ్‌పై పట్టుబడిన వ్యక్తికి ఆ ప్లాట్‌ఫారమ్‌ను విడిచిపెట్టిన మునుపటి రైలు లేదా ఆ ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చిన రైలు ధర కంటే రెట్టింపు ఛార్జీని కూడా ఆర్థిక జరిమానాగా వసూలు చేస్తారు.
వాస్తవానికి, ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు జారీ చేయబడతాయి. అంటే ప్లాట్‌ఫారమ్ సామర్థ్యానికి మించి ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు జారీ చేయబడవు. సామర్థ్యం ప్రకారం ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు ఇప్పటికే జారీ చేయబడితే.. దీని తర్వాత రైల్వే సిబ్బంది ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు అడిగే వ్యక్తికి టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరించవచ్చు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం